అల్లు అర్జున్‌కు మెగా కుటుంబం కౌంటర్

అల్లు అర్జున్ కు, మెగా కుటుంబానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. పదిరోజులకోసారి ఆ కుటుంబం తరఫున లేదంటే అల్లు అర్జున్ తరఫున ఒకరు మీడియా ముందుకు వచ్చి ఏవేవో సుద్దులు చెప్పేసి వెళతారు. అవి విన్నవారంతా నిజమే కాబోలు అనుకుంటున్నారు. రెండు రోజుల తర్వాత షరా మాములే. అల్లు అర్జున్ కు, మెగా కుటుంబానికి మధ్య ఎటువంటి సయోధ్య కుదరలేదని ప్రస్తుత పరిణామాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. తాజాగా మెగా కుటుంబానికి చెందిన నాగబాబు కుమార్తె నిహారిక అల్లు అర్జున్ కు కౌంటర్ ఇచ్చిందనే అభిప్రాయాన్ని సినీ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

సినిమాను హిట్ చేయాలని కోరింది
ఇటీవలే తాను నిర్మించిన కమిటీ కుర్రోళ్లు సినిమా ప్రి రిలీజ్ఈవెంట్ లో నిహారిక కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఈమధ్య కాలంలో తమ కుటుంబానికి అంతా మంచి జరుగుతోందని చెప్పింది. పెదనాన్నకు పద్మవిభూషణ్ పురస్కారం వచ్చిందని, చరణ్ అన్న సినిమా ఆస్కార్ కు వెళ్లిందని, బాబాయ్ పవన్ కల్యాణ్ ఏపీ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యారని, ఎన్నికల్లో జనసేన 21 నియోజకవర్గాల్లోను విజయం సాధించిందని.. ఇలాంటి మంచి పరిణామాలు జరుగుతున్న సమయంలోనే తాను నిర్మాతగా చేస్తున్న తొలి చిత్రం కమిటీ కుర్రాళ్లు విడుదలవుతోందని, దీన్ని విజయవంతం చేయాలని కోరింది.

mega star chiranjeevi family counter to allu arjun

ఉద్దేశపూర్వకంగా విస్మరించింది
అందరి గురించి చెప్పిన నిహారిక అల్లు అర్జున్ గురించి మాటమాత్రం కూడా చెప్పలేదు. కావాలనే ఉద్దేశపూర్వకంగా బన్నీ ప్రస్తావన తీసుకురాలేదని అతని అభిమానులు అంటున్నారు. చెప్పుకోవడానికి అతని దగ్గర ఏదీ లేదని మెగా అభిమానులు అంటున్నారు. ఇలా ఈ రెండు గ్రూపులు సామాజిక మాధ్యమాల్లో హోరాహోరీగా యుద్ధం చేస్తున్నాయి. కావాలనే నిహారిక బన్నీ పేరు చెప్పలేదని, అతన్ని మెగా కుటుంబంలోని వ్యక్తిగా చూడటంలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతంతమాత్రం ఉన్న వీరి విభేదాలు ఎన్నికల సమయంలో తీవ్రస్థాయికి చేరాయి. పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అల్లు అరవింద్ కుటుంబం నుంచి ఎవరూ హాజరుకాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+