నేను అల్లు అర్జున్‌కు పెద్ద అభిమానిని: చిరంజీవి

పుష్ప2 సినిమా భారీ విజయాన్ని అందుకుంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా మైత్రీ మూవీస్ ఈ సినిమాను నిర్మించింది. హిందీ వెర్షన్ లో ఈ సినిమాకు అనూహ్య ఆదరణ దక్కుతోంది. అక్కడే ఈ సినిమాకు దాదాపు రూ.700 నుంచి రూ.800 కోట్ల కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మెగా కుటుంబానికి, అల్లు అర్జున్ కుటుంబానికి మధ్య దూరం పెరిగింది.. ఈ రెండు కుటుంబాల మధ్య సఖ్యత లేదు అనే విషయం తెలిసిందే. సామాజిక మాధ్యమాల్లో ఈ రెండు కుటుంబాలకు చెందిన అభిమానులు నిత్యం కొట్లాడుకుంటారు. సాయిధరమ్ తేజ్ మినహా మెగా హీరోలెవరూ పుష్ప2పై స్పందించలేదు.

బన్నీని అభినందించిన చిరంజీవి
ఇటువంటి తరుణంలో పుష్ప2 విజయం సాధించినందుకు అల్లు అర్జున్ ను చిరంజీవి అభినందించారని, తాను బన్నీకి పెద్ద అభిమానిని అన్నట్లుగా వార్తలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. బన్నీకి స్వీట్ తినిపించే ఫొటో వైరలవుతోంది. ఈ ఫొటోలో చిరంజీవి శ్రీమతి సురేఖ కూడా ఉన్నారు. పుష్ప2 ఘనవిజయానికి బన్నీని అభినందిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే అవన్నీ నిజమైన వార్తలు కాదని తేలింది. పుష్ప1 సినిమాకు అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు వచ్చింది. ఆ సమయంలో బన్నీని ఇంటికి పిలిపించిన చిరంజీవి తీపి తినిపించి బాగా అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకున్నారు. అప్పుడు సంబంధించిన ఫొటో అది.

Mega Star Chiranjeevi feeds sweets to Allu Arjun for the success of Pushpa 2

రెండు కుటుంబాలు కలిసిపోవాలని కోరుకుంటున్న అభిమానులు
అయితే కొందరు పుష్ప2 సందర్భంగా బన్నీని పిలిపించి అభినందించారంటూ వార్తను వైరల్ చేస్తున్నారు. ఇంతవరకు చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కల్యాణ్, నాగబాబు, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నీహారిక, శ్రీజ, సుస్మిత.. ఇలా ఎవరూ కుటుంబానికి చెందినవారెవరూ స్పందించలేదు. పుష్ప విజయోత్సవ వేడుకలో బన్నీ పవన్ కల్యాణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడంతోపాటు మనస్ఫూర్తిగా తాను చెబుతున్నట్లు థాంక్స్ బాబాయ్ అన్నారు. ఇకనుంచైనా ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోవాలని, రెండు కుటుంబాలు కలిసిపోవాలని అందరూ కోరుకుంటున్నారు. మరి దానికి మెగా కుటుంబంకానీ, అల్లు అరవింద్ కుటుంబంకానీ స్పందిస్తుందేమో చూడాలి మరి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+