టాప్-10 హీరోల్లో చివరి నుంచి రెండో స్థానంలో చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. ఎందుకంటే ఆయన పేరు చెబితే కాళ్లు సహజంగానే నర్తిస్తాయి. ఆయన పాట వింటున్నా చాలు మనకు తెలియకుండానే మన కాళ్లు డ్యాన్స్ వేస్తాయి. తన నృత్యాలతో, నటనతో, పోరాట ఘట్టాలతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. దాదాపు నాలుగు దశాబ్దాలపాటు అగ్ర హీరోగా కొనసాగారు. హీరోలు అంటే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ఈ నలుగురు మొదటి నాలుగు స్థానాల్లో నిలిచేవారు. అటువంటి చిరంజీవి ఈరోజు హీరోల జాబితాలో తొమ్మిదో స్థానానికి పడిపోయారు.

జీర్ణించుకోలేకపోతున్న మెగా అభిమానులు
వినడానికి మెగా అభిమానులకు ఎంతో బాధగా ఉండొచ్చు.. లేదంటే ఇబ్బందికరంగా ఉండొచ్చుకానీ ఇది వాస్తవం. మన తెలుగు హీరోల్లో ప్రస్తుతం చిరంజీవి తర్వాత పదో స్థానంలో విజయ్ దేవరకొండ నిలిచారు. ప్రతి సంవత్సరం ఆర్మాక్స్ సంస్థ తెలుగులో అత్యధిక ప్రజాదరణ పొందిన హీరోలు ఎవరు? అనే విషయంలో జాబితాను ప్రకటిస్తుంటుంది. ఈ జాబితాలో తొలిస్థానాన్ని ప్రభాస్ దక్కించుకున్నారు. ఈ జాబితాను పక్కన పెడితే చిరంజీవి తొమ్మిదో స్థానంలో నిలవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

mega star chiranjeevi is 9th place in ormax most popular heroes list

వయసుకు తగ్గ పాత్రలేవీ?
రాజకీయ పార్టీని స్థాపించిన తర్వాత కొన్ని సంవత్సరాలు సినిమాలకు దూరం జరిగారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించి తొలి చిత్రంగా ఖైదీ నెంబరు 150తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి, ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేర్ వీరయ్య, భోళాశంకర్ చిత్రాల్లో నటించారు. కేవలం ఈ సినిమాల్లో ఖైదీ నెంబరు 150తోపాటు వాల్తేరు వీరయ్య.. ఈ రెండే విజయాన్ని నమోదు చేశాయి. మిగతావన్నీ దారుణమైన పరాజయాన్ని చవిచూశాయి. మొదటినుంచి హీరోగా ఉండటంవల్ల ఆయన వయసుకు తగ్గ పాత్రలను ఎంచుకునే విషయంలో వెనకడుగు వేశారు.

హీరోగా చేయడంలో తప్పులేదు కానీ..
68 సంవత్సరాల వయసులోను హీరోగానే చేస్తున్నారుకానీ విభిన్నమైన కథలను ఎంచుకోకుండా మూసధోరణిలో ముందుకు సాగుతున్నారు. జైలర్ లో రజనీకాంత్ పోషించిన తరహా పాత్రలను పోషిస్తే మంచి ఆదరణ దక్కుతుందని, అలా కాకుండా ఒకే ధోరణిలో నటిస్తే పరాజయాలు తప్పవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తు తరం ప్రేక్షకుల అభిరుచులు చాలా విభిన్నంగా ఉంటున్నాయని, వాటిని అందుకోవడానికి చిరంజీవి ఎంతో కష్టపడాల్సి ఉంటుందంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+