చిరంజీవి వద్దంటే... మోహన్ బాబు బ్లాక్ బస్టర్ కొట్టాడు!
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అల్లుడగారు చిత్రంతో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 90వ దశాబ్దంలో తిరుగులేని హీరోగా కొనసాగడానికి ఆయనకు పునాది వేసింది ఈ సినిమా. దీని తర్వాత అసెంబ్లీ రౌడీ, రౌడీగారిపెళ్లాం, బ్రహ్మ, పెదరాయుడు, కుంతీపుత్రుడు, అల్లరి మొగుడు లాంటి చిత్రాలతో భారీ కలెక్షన్లు రాబట్టి కలెక్షన్ కింగ్ అనే బిరుదును సంపాదించుకున్నారు. మోహన్ బాబు సొంత బ్యానర్ లక్ష్మీప్రసన్న బ్యానర్ పై కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
చిరంజీవి నుంచి రాఘవేంద్రరావుకు కబురు
వాస్తవానికి ఈ సినిమాను ముందుగా చిరంజీవితో చేయలని రాఘవేంద్రరావు భావించారు. దీనికి ముందే ఇద్దరూ కలిసి జగదేక వీరుడు అతిలోక సుందరి పేరుతో ఇండస్ట్రీ హిట్ కొట్టారు. తిరిగి వీరిద్దరి కాంబినేషన్ లో ఈ సినిమాతో శ్రీకారం చుడతారని అందరూ భావించారు. అల్లుడుగారు సినిమా చేసి జగదేకవీరుడు రికార్డులను బద్దలు కొట్టాలని రాఘవేంద్రరావు భావించారు. అల్లుడుగారు కథను చిరంజీవికి వినిపించారు. తర్వాత సినిమాకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో చిరంజీవి నుంచి రాఘవేంద్రరావుకు కబురు వచ్చింది.

క్లైమాక్స్ మార్చడం ఇష్టంలేక..
అల్లుడుగారు సినిమా మనిద్దరం చేయొద్దని, ఎందుకంటే సినిమా కథ ప్రకారం క్లైమాక్స్ లో హీరోకు ఉరిశిక్ష పడుతుందని, అలా ఉరిశిక్ష పడితే అభిమానులకు నచ్చదని, క్లైమాక్స్ ను మారిస్తే కథ మొత్తం మారిపోతుందన్నారు. దీంతో రాఘవేంద్రరావు చిరంజీవి నిర్ణయంలో ఏకీభవించి క్లైమాక్స్ మారుద్దామనుకున్నారు. అయితే సినిమా కథ మొత్తం క్లైమాక్స్ మీదే ఆధారపడివుంటుంది. దీంతో దీన్ని మార్చలేక కథ ప్రకారం సినిమా తీయాలని భావించి మోహన్ బాబును హీరోగా ఎంచుకున్నారు రాఘవేంద్రరావు. ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. మోహన్ బాబుతోపాటు శోభన, సత్యనారాయణ, చంద్రమోహన్ లాంటి నటులంతా తమ నటనా విశ్వరూపాన్ని ప్రదర్శించడంతో అతిపెద్ద హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో మోహన్ బాబు దశ మొత్తం తిరిగిపోయింది.












Click it and Unblock the Notifications