'కల్కి'లో ప్రభాస్ పాత్రను తిరస్కరించిన స్టార్ హీరో
'కల్కి' చిత్రం సంచలన రికార్డులు నెలకొల్పుతూ విజయపథంలో దూసుకుపోతోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతకాంపై సి.అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మించారు. దీనికి బడ్జెట్ రూ.600 కోట్లు అయింది. తాజాగా ఈ చిత్రం రూ.700 కోట్లు వసూలు చేసింది. రూ.1500 నుంచి రూ.2వేల కోట్లు వసూలు దిశగా పయనిస్తోంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే లాంటి భారీ తారాగణం కూడా భాగమైంది.
ప్రభాస్ కు సరిగ్గా సరిపోయింది.
ప్రభాస్ కటౌట్ కు ఈ సినిమా సరిగ్గా సరిపోయిందని సినీ ప్రియులంతా అభిప్రాయపడుతున్నారు. పురాణాలను సైన్స్ కు ముడిపెడుతూ నాగ్ అశ్విన్ రాసుకున్న కథ అందరినీ ఆకట్టుకుంది. కామిక్స్ ఉండటం కూడా కొత్తగా అనిపించింది. ఇంత తక్కువ ఖర్చుతో హాలీవుడ్ ను మించిన సినిమా తీశారని, ఎలా సాధ్యమైందంటూ హాలీవుడ్ దిగ్గజాలంతా ఆశ్చర్యపోతున్నాయి. ఒక్క అమెరికాలోనే కల్కి భారీ వసూళ్లను రాబడుతుండటంపై అక్కడి ప్రేక్షకులు కూడా నివ్వెరపోతున్నారు. ఇంతటి ఘనవిజయాలను సాధించిన ఈ సినిమాకు ముందుగా అనుకున్న హీరో ప్రభాస్ కాదు.

చిరంజీవికి కథ వినిపించిన నాగ్ అశ్విన్
మహానటి విడుదలైన తర్వాత ఆ చిత్ర యూనిట్ సభ్యులకు చిరంజీవి చిన్న పార్టీ ఇచ్చారు. ఆ వేడుకలో పాల్గొన్న సందర్భంగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ కథను మీకోసమే రాసుకున్నాను సార్.. మీరు చేయాలి అంటూ కల్కి కథను వినిపించారు. అయితే చిరంజీవి దీన్ని సున్నితంగా తోసిపుచ్చారు. ఈ కథ తనకు సెట్ అవదని, ప్రభాస్ అయితే సరిగ్గా ఉంటుందని, ఈ సినిమాను ప్రభాస్ తో చేయాలంటూ నాగ్ అశ్విన్ కు సూచించారు. దీంతో డార్లింగ్ కు కథ వినిపించిన నాగ్ అశ్విన్ దీన్ని ఒక విజువల్ వండర్ గా తెరకెక్కించి అద్భుత విజయాన్ని కైవసం చేసుకున్నాడు. చిరంజీవి చేసుంటే బాగుండేందంటూ అతని అభిమానులు సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications