నేటితో చిరంజీవి ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పట్టుదలగా లక్ష్యం కోసం పోరాడారు.. మెగాస్టార్ చిరంజీవిగా మారి నేటితో 69వ వసంతంలోకి ప్రవేశించారు. స్వామి ఆశీర్వాదం కోసం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో రాణించాలంటే ఏదో ఒక ప్రత్యేకత చూపించాలని భావించిన చిరంజీవి అందుకు డ్యాన్స్ ను, ఫైట్లను ఎంచుకున్నారు. సినిమాల్లోకి అడుగు పెట్టిన సమయంలో ఆయన స్టార్ హీరోకాదు.. నృత్యంలో శిక్షణ కూడా లేదు. కాకపోతే భరతనాట్యంలో మంచి ప్రావీణ్యం ఉంది.
బ్రేక్ డ్యాన్స్ ను పరిచయం చేశారు
దాన్నే పునాదిగా చేసుకొని ప్రేక్షకులకు బ్రేక్ డ్యాన్స్ అనేది పరిచయం చేశారు. దీంతో శివశంకర్ వరప్రసాద్ కాస్తా చిరంజీవిగా మారి వెండితెరపై మకుటంలేని మహారాజుగా వెలుగుతున్నారు. భారతీయ సినీ పరిశ్రమలో మొదటిసారిగా కోటిరూపాయల పారితోషికం తీసుకున్న ఏకైకా హీరోగా రికార్డు సృష్టించారు. ప్రేక్షకుల కోసం చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ఏర్పాటు చేశారు. దేశంలోనే అత్యంత ధనవంతుడైన హీరోగా కొనసాగుతున్నారు. ఆయనకు లగ్జరీ కార్లతోపాటు విలాసవంతమైన ఇళ్లు ఉన్నాయి.

సినిమాకు రూ.45 కోట్లు తీసుకుంటున్నారు
ప్రస్తుతం సినిమాకు రూ.45 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారు. బెంగళూరులో ఓ ఫాంహౌస్ ఉంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 25లో ఓ విలావంతమైన భవనం ఉంది. దీనిలో అత్యంత అధునాతన సౌకర్యాలు ఉంటాయి. దీని విలువ రూ.50 కోట్లకు పైమాటే. చెన్నైలో కూడా ఇళ్లతోపాటు ఖరీదైన స్థలాలు కూడా ఉన్నాయి. ఆయన దగ్గర అత్యంత ఖరీదైన కార్ల కలెక్సన్ ఉంది. టయోటా, ఆడి, రేంజ్ రోవర్, బెంజ్, రోల్స్ రాయిస్ లాంటివన్నీ ఉన్నాయి. దేశంలో ఎక్కడకు వెళ్లాలన్నా తన సొంత ప్రయివేట్ జెట్ లోనే వెళతారు. ఒక నివేదిక ప్రకారం ఆయన ఆస్తుల విలువ రూ.2వేల కోట్లుగా అంచనా వేస్తున్నారు. నివేదిక ప్రకారం కాకుండా చూస్తే అంతకన్నా ఎక్కువే ఉండొచ్చని తెలుగు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఓ కానిస్టేబుల్ కొడుకు కష్టపడి అంచలంచెలుగా ఎదిగి ఈరోజు ఒక ఉన్నతస్థాయిలో ఉండటం అనేది ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.












Click it and Unblock the Notifications