మెగాస్టార్ చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ స్టోరీ లీక్..!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేస్తున్నారు. 'మెగా 157' అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఉగాది సందర్భంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా ఇప్పటివరకు రెండు షెడ్యూల్స్‌ను పూర్తిచేసుకుంది. చిరు సరసన నయనతార, కేథరీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇప్పటికే వరుస హిట్లతో దూసుకుపోతున్నారు అనిల్ రావిపూడి. రీసెంట్ గానే సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా భారీ హిట్ అందుకుంది. ఏకంగా 300 కోట్లు కలెక్షన్స్ కొల్లగొట్టి అందరికీ షాక్ ఇచ్చింది. దాంతో ఈసారి చిరంజీవితో అనిల్ ఏ రేంజ్ హిట్ కొడతారో అని జోరుగా చర్చ నడుస్తోంది.

స్టోరీ లీక్..
అయితే రీసెంట్ గానే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిల్ రావిపూడి.. చిరుతో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అనిల్ మాట్లాడుతూ .. ఇది ఒక భార్యాభర్తల కథ. అందులో 70% కామెడీ, 30% ఎమోషనల్ డ్రామా ఉంటుంది. చిరంజీవి పాత్ర 'గ్యాంగ్ లీడర్', 'ఘరానా మొగుడు', 'చంటబ్బాయి' తరహాలో మాస్, ఫన్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ మిక్స్‌తో ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా కథ సిద్ధం చేశాం. ఇది నా కెరీర్ బెస్ట్ ఫిల్మ్ అవుతుందన్న నమ్మకం ఉందని చెప్పారు. ఇప్పటికే షూట్ చేసిన కొన్ని సీన్స్ చిరు పర్ఫార్మెన్స్‌తో ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ ఇస్తాయని చెప్పారు.
వెంకటేష్ స్పెషల్ ఎంట్రీ..
అయితే ఇప్పటి వరకు గాసిప్‌గానే ఉన్న వెంకటేష్ గెస్ట్ రోల్ విషయాన్ని అనిల్ రావిపూడి కన్ఫర్మ్ చేశారు. వెంకీ రోల్ ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు చెప్పేస్తే, థంబ్‌నెయిల్స్‌తో స్టోరీలు రాసేస్తారని.. కానీ ఒక్క విషయం మాత్రం చెప్తానన్నారు. ఆయన ఎంట్రీ రోజు బ్లాస్ట్ అవుతుంది అన్నారు. అలానే సంక్రాంతికి వస్తున్నాం బుడ్డోడు బుల్లి రాజు.. ఈ సినిమాలో కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నాడని తెలిపారు.
Mussoorie Schedule Done 🥳👍🏻👌🏽
— Anil Ravipudi (@AnilRavipudi) June 19, 2025
It’s going to be super fun this Sankranthi 2026 with #Mega157 🥳😍😉
All charged up to begin the next schedule soon ❤️
Megastar @KChiruTweets garu
#Nayanthara #BheemsCeciroleo @sahugarapati7 @sushkonidela #Archana @YoursSKrishna @Shine_Screens… pic.twitter.com/bTe4I7patO
ఇక మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజున మూవీ టైటిల్ ప్రకటిస్తాం అని వెల్లడించారు. అప్పటి వరకు సస్పెన్స్ కొనసాగుతుందన్నారు. మరోవైపు 'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్‌గా 'సంక్రాంతికి మళ్లీ వస్తున్నాం' అనే టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు.
మరోవైపు చిరంజీవి ప్రస్తుతం బింబిసారా డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర' మూవీ చేస్తున్నారు. ముగింపు దశకు చేరుకున్న ఈ మూవీ ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. ఈ చిత్రంలో త్రిష, అషికా రంగనాథ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి రిలీజ్ అయిన పోస్టర్లు, వీడియోలు ఆడియన్స్ లో భారీ అంచనాలను క్రియేట్ చేశాయి.












Click it and Unblock the Notifications