మెగాస్టార్ - అనిల్ రావిపూడి 'మెగా 157' షురూ.. స్పెషల్ గెస్టుగా వెంకీ
మెగాస్టార్ చిరంజీవి ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో ఓ సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే. రీసెంట్ గానే విశ్వక్ సేన్ నటించిన లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చిరంజీవి ఈ విషయాన్ని ప్రకటించారు. కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపొందనుందని అనౌన్స్ చేశారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఈరోజు పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు.
సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమానికి విక్టరీ వెంకటేశ్ స్పెషల్ గెస్ట్ గా వచ్చి.. ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. అలానే సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు, రచయిత విజయేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలానే నిర్మాతలు అల్లు అరవింద్, దగ్గుబాటి సురేశ్ బాబు, అశ్వనీ దత్, దిల్ రాజు, నాగవంశీ.. దర్శకులలో వంశీ పైడిపల్లి, శివ నిర్వాణ, వశిష్ఠ, బాబీ, శ్రీకాంత్ ఓదెల పాల్గొన్నారు.

ఇక ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా.. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని టాక్ నడుస్తోంది. అలానే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మాత్రం జూన్ నుంచి ప్రారంభం కానున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ కోసం చిరు 90 రోజుల కాల్ షీట్ ఇచ్చినట్లు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి నెట్టింట్లో అనిల్ రావిపూడి రెమ్యూనరేషన్ గురించి పలు రూమర్లు వినిపిస్తున్నాయి. ఏకంగా రూ.25 కోట్ల రెమ్యూనరేషన్ తో పాటు సినిమా హిట్ అయి లాభాలు వస్తే లాభాల్లో వాటాలు తీసుకునేందుకు డేల్ సెట్ చేసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అనిల్ రావిపూడి మీద నమ్మకంతో నిర్మాతలు సైతం ఆ డిమాండ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అనుకుంటున్నారు.
On this auspicious UGADI, Team #Mega157 embarks on their journey with a grand pooja ceremony ❤️🔥
— Gold Box Entertainments (@GoldBoxEnt) March 30, 2025
ఉగాది కి ఆరంభం 😍 సంక్రాంతికి సంబరం 😎 #ChiruAnil begins with a clap by Victory @VenkyMama ❤️
First shot direction @Ragavendraraoba
Script handover #Dilraju #Shirish
Camera… pic.twitter.com/pq9RNRVgQK
ఇక మెగాస్టార్ ప్రస్తుతం బింబిసారా డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర' మూవీ చేస్తున్నారు. ముగింపు దశకు చేరుకున్న ఈ మూవీ ఈ ఏడాదిలోనే సమ్మర్ కానుకగా విడుదల కానుంది. ఈ చిత్రంలో త్రిష, అషికా రంగనాథ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి రిలీజ్ అయిన పోస్టర్లు, వీడియోలు ఆడియన్స్ లో భారీ అంచనాలను క్రియేట్ చేశాయి.
A stellar beginning for Team #Mega157 at the auspicious Pooja Ceremony ❤️🔥
— Gold Box Entertainments (@GoldBoxEnt) March 30, 2025
The #ChiruAnil opening event was a star-studded spectacle, with producers, directors, and celebrated icons from the industry gracing the occasion and extending their heartfelt wishes to the team ❤️❤️❤️… pic.twitter.com/TJEgMnhtCx












Click it and Unblock the Notifications