Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అగ్గి రాజేసిన చిరంజీవి కొత్త యాడ్... కులాల మధ్య ఆధిపత్య పోరు?

మెగాస్టార్ చిరంజీవి 69 సంవత్సరాల వయసులో కూడా యువ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్నారు. వరుసగా ప్రాజెక్టులను ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర చేస్తున్నారు. దీనితర్వాత చేయబోయే సినిమాను, దర్శకుడును కూడా త్వరలోనే ప్రకటించబోతున్నారు. ఈ సమయంలో ఓ పాల ఉత్పత్తుల కంపెనీ తమ వాణిజ్య ప్రకటనలో నటించాలంటూ చిరంజీవిని కోరగా ఆయన అందుకు అంగీకరించారు. ప్రస్తుతం చిరంజీవి నటించిన ఈ యాడ్ సామాజిక మాధ్యమాల్లో వైరలవడంతోపాటు ఓ వివాదాస్పద అంశానికి కారణంగా మారింది.

యాడ్ లో బాగా నటించిన చిరంజీవి
ఈ వాణిజ్య ప్రకటనలో చిరంజీవిగా, ఆత్మారావుగా ద్విపాత్రాభినయం చేశారు. చిరంజీవితోపాటు కమెడియన్ సత్య కూడా నటించారు. ఈ ప్రకటనలో చిరంజీవి నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. సీనియర్ ఆర్టిస్టు కాబట్టి ఎంతో తేలికగా ఈ యాడ్ చేశారంటూ అభిమానులు కొనియాడుతున్నారు. ఊరికే మెగాస్టార్ అయిపోరు అంటూ మెగా అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు. అయితే సోషల్ మీడియా ఈ యాడ్ కు కులం రంగు పులిమింది. దీనిపై రచ్చ రచ్చ జరుగుతోంది. కొంతమంది తాము ఇకనుంచి కంట్రీ డిలైట్ పాలు వాడమంటూ కామెంట్లు పెడుతున్నారు. కంట్రీ డిలైట్ పాలకు తాము గుడ్ బై చెప్పేస్తున్నామంటూ మరో నెటిజన్ కామెంట్ పెట్టారు.

megastar Chiranjeevi country delight add became a controversial topic

కులం రంగు పులిమారు
ఇదంతా కులానికి సంబంధించిన యుద్ధమని కొందరు అభిప్రాయపడుతున్నారు. చిరంజీవి ఈ యాడ్ చేయడంవల్లే ఇకనుంచి కంట్రీ డిలైట్ పాలు వాడమంటూ బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. సామాజికవర్గాలవారీగా అభిమానులు చీలిపోయి సామాజిక మాధ్యమాల్లో కంట్రీ డిలైట్ యాడ్ పై యుద్ధం చేసుకుంటున్నారు. ఒక సెలబ్రిటీ ఒక ఉత్పత్తి గురించి చెప్పారంటే దాన్నిగురించి అన్నిరకాలుగా పరిశీలించి, నాణ్యత తెలుసుకొని మరీ యాడ్ చేస్తారని, చిరంజీవి కూడా అలాగే చేశారని, కంట్రీ డిలైట్ పాలల్లో నాణ్యతకు ఢోకా లేదని, అలా కాకుండా కేవలం సామాజికవర్గాలవారీగా చీలిపోయి కులం రంగు పులుముకొని రాజకీయాలు చేయడంవల్ల నష్టపోయేది చిరంజీవి కాదని, ప్రజలే నష్టపోతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ యాడ్ కు దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు.

వ్యతిరేకంగా ప్రచారం చేస్తారు
సాధారణంగా సినీ, రాజకీయ రంగాల్లో కులాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంటుంది. సినీ రంగంలో ప్రధానంగా రెండు రాజకీయ కులాల మధ్య హోరాహోరీ యుద్ధం నడుస్తుంటుంది. ఒక వర్గానికి చెందిన హీరో సినిమా విడుదలైనప్పడు వేరే వర్గానికి చెందినవారు వ్యతిరేకంగా ప్రచారం చేయడం సహజంగా జరుగుతుంటుంది. ఇటువంటి వాతావరణ పరిస్థితుల మధ్య కంట్రీ డిలైట్ పాల యాడ్ కూడా కులం రంగు పులుముకోవడం శోచనీయం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+