ఫ్యాన్స్ కి పూనకాలు కన్ఫార్మ్.. రామ్ చరణ్ నెక్స్ట్ మూవీలో మెగాస్టార్ గెస్ట్ రోల్ ?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫుల్ ఫామ్ లో దూసుకుపోతు వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవల శంకర్ డైరెక్షన్ ఆయన నటించిన 'గేమ్ ఛేంజర్' మూవీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. అయితే ప్రస్తుతం చరణ్ ఉప్పెన ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. #RC16 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ రూపొందుతున్నట్టు ఫిల్మ్ వర్గాలలో చర్చ నడుస్తోంది.

క్రియేటివ్ డైరెక్టర్‌ సుకుమార్‌ శిష్యుడిగా ఉప్పెన చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన బుచ్చిబాబు.. తొలి చిత్రంతోనే వంద కోట్లు కొల్లగొట్టి మంచి పేరు సంపాదించుకున్నారు. ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో సైతం మాట్లాడుతూ ఈసారి కూడా హిట్ గ్యారంటీ అంటూ ధీమా వ్యక్తం చేస్తూ మాట్లాడారు. అలానే ఈ చిత్రంలో సైతం విలక్షణ నటుడు జగపతి బాబు, కన్నడ సూపర్‌ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌, బాలీవుడ్‌ నటుడు, మిర్జాపూర్‌ వెబ్‌ సిరీస్‌ ఫేం దివ్వేందు శర్మలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వారు సైతం మీడియా సమావేశాల్లో ఈ సినిమా గురించి గొప్పగా చెబుతూ ఉండడంతో అభిమానుల్లో స్ట్రాంగ్ బాజ్ క్రియేట్ అయ్యింది.

Megastar chiranjeevi guest role in Ram Charan s next movie

ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్‌ ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్‌ చిరంజీవి అతిథి పాత్ర పోషిస్తున్నారంటూ సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

గతంలో మగధీర సినిమాలో ఓ సాంగ్ లో చిరు అలా వచ్చి ఇలా వెళ్లిపోతారు. ఇక శివ కొరటాల దర్శకత్వంలో వచ్చిన ఆచార్య సినిమాలో కలిసి నటించినా ఆ మూవీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. దీంతో ఈసారి హిట్ పక్కా అనుకుంటున్న ఈ సినిమాలో చిరు కూడా గెస్ట్ రోల్ లో కనిపిస్తే అభిమానులకు ఇక పూనకాలే అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మూవీ యూనిట్ లో ఎవరైనా స్పందించి ఈ విషయం గురించి చెబుతారో అని వేచి చూడక తప్పదు. మరోవైపు మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' మూవీ చిత్రంతో బిజీగా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+