మెగాస్టార్ విధ్వంసం.. రచ్చ లేపుతున్న టైటిల్ గ్లింప్స్!
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్లో వస్తున్న సినిమాకు టైటిల్ ను ఖరారు చేశారు. మెగాస్టార్ 158వ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు 'కాకా' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే కానుకగా చిత్ర బృందం టైటిల్ గ్లింప్స్ ను విడుదల చేసింది. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ప్రస్తుతం సినీ అభిమానుల్లో భారీ ఉత్కంఠను రేకెత్తిస్తోంది. సాధారణంగా టైటిల్ రివీల్స్ కేవలం మాస్ ఎలివేషన్లతో సరిపెట్టుకుంటాయి. కానీ 'కాకా' టైటిల్ గ్లింప్స్ మాత్రం క్యారెక్టరైజేషన్, హ్యూమర్, మిస్టరీ, హై-వోల్టేజ్ మాస్ ఎనర్జీల కలయికతో అద్భుతంగా ఆకట్టుకుంది.
ఈ గ్లింప్స్‌లో మెగాస్టార్ చిరంజీవి 'కె.సత్యం' అనే సాధారణ ఆక్వా ఇండస్ట్రీ సూపర్ వైజర్ గా కనిపిస్తారు. చుట్టుపక్కల వారితో సరదాగా మాట్లాడుతూ..బాధ్యత గల తండ్రిగా తన కూతురి స్కూటర్ తాళాల గురించి మాట్లాడే సన్నివేశాలు ఎంతో సహజంగా ఉంటాయి. అయితే ఈ తాళాలు నీటిలో పడిపోయినప్పుడు సత్యం అయస్కాంతం సాయంతో వాటిని బయటకు తీసే క్రమంలో తాళాలతో పాటు అనూహ్యంగా తుపాకులు బయటపడతాయి. ఈ ఒక్క సన్నివేశంతో కథలో గూస్‌బంప్స్ తెప్పించే మిస్టరీ కోణం మొదలై 'కాకా' టైటిల్ కార్డ్ పడుతుంది.

అనంతరం గ్లింప్స్ రెండో భాగంలోకి అడుగుపెడుతుంది. అక్కడ వింటేజ్ లుక్ లో యంగ్ చిరంజీవి ఎంట్రీ ఇచ్చి తన మార్క్ స్టైల్, ఎనర్జీ, ఫైర్ తో రచ్చ లేపుతారు. వరుస బుల్లెట్ల వర్షం, దానికి తోడు చిరు సీనియర్, యంగ్ అవతార్ల మధ్య ఉన్న తేడా ప్రేక్షకుల్లో కథపై తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తాయి. అసలు సత్యం గతం ఏమిటి? అతనికి ఈ యంగ్ అవతార్ కు ఉన్న లింక్ ఏంటనే ప్రశ్నలు సినిమాపై అంచనాలను పెంచేశాయి.
డైరెక్టర్ బాబీ కొల్లీ రొటీన్ మాస్ టెంప్లేట్ కు పరిమితం కాకుండా, క్యారెక్టర్ లోతును చూపిస్తూనే మాస్ ఎలివేషన్లను డిజైన్ చేసిన తీరు ప్రశంసనీయం. విజయ్ కార్తీక్ కణ్ణన్ సినిమాటోగ్రఫీ, తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ విజువల్స్ కు ప్రాణం పోశాయి. ముఖ్యంగా క్లాసిక్ 'గ్యాంగ్ లీడర్' సాంగ్ రీమిక్స్ చిరంజీవి అభిమానులకు అసలైన పూనకాలు తెప్పించేలా ఉంది. వెంకట్ కె నారాయణ నిర్మాణ విలువలు గ్రాండ్ గా కనిపిస్తున్నాయి.
సాధారణ సూపర్‌వైజర్‌గా ఒదిగిపోతూనే, యాక్షన్ మోడ్ లో తనదైన స్వాగర్ తో మెగాస్టార్ చిరంజీవి చూపించిన స్క్రీన్ ప్రెజెన్స్ మెగాస్టార్ స్టామినాను మరోసారి చాటిచెప్పింది. 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నఈ 'కాకా' టైటిల్ గ్లింప్స్, థియేటర్లలో బాక్సాఫీస్ సునామీ సృష్టించడం ఖాయమనే సంకేతాలను ఇచ్చింది.
#Mega158 is #KAAKA ❤️🔥
— KVN Productions (@KvnProductions) August 22, 2026
Presenting the WHOLE NEW SIDE of MEGASTAR @Kchirutweets Garu on his birthday💥
TITLE GLIMPSE OUT NOW😎
— https://t.co/Qtc0T6fhcC
KAAKA will set THE BLOODY BENCHMARK on the BIG SCREENS this Sankranthi, on JANUARY 13, 2027 🔥#HBDMegastarChiranjeevi
A… pic.twitter.com/0XEPCjXcQk














Click it and Unblock the Notifications