ఆ బ్యూటీతో మెగాస్టార్ మూవీ చేస్తే బ్లాక్ బస్టర్ పక్కా.. ఎవరా లక్కీ లేడీ !!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఫుల్ సంతోషంలో ఉన్నారు. సంక్రాంతి పండుగను సందర్భంగా ఆయన నటించిన " మన శంకర వరప్రసాద్ గారు" ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం ఫస్ట్ షో నుంచే బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ చిత్రంతో అటు మాస్, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్‌ని అలరించారు. అంతే కాకుండా చిరు కెరీర్‌లోనే తొలిసారి రూ.300 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించారు. మొత్తానికి వింటేజ్ బాస్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ విజయంతో చిరు నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా పెరిగాయి.
కాగా ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వగా.. లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటించింది. కేథరిన్ ముఖ్య పాత్ర పోషించగా.. భీమ్స్ సిసిరీలియో సంగీతం సమకూర్చారు. అలానే ఈ మూవీని చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల, నిర్మాత సాహు గారపాటి తమ గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, షైన్ స్క్రీన్ బ్యానర్లపై నిర్మించారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా సోషల్ మీడియాలో జోరుగా ఓ చర్చ నడుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి మూవీలో ఆ నటి ఉంటే హిట్ పక్కా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఆ నటి ఎవరా అని అంతా తెగ కామెంట్స్ చేస్తూ డిస్కషన్ చేస్తున్నారు.

ఆ నటి ఎవరంటే..
మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి తిరిగి వచ్చిన తర్వాత వరుసగా ఇది మూడో విక్టరీ. ఖైదీ నెం.150, వాల్తేర్ వీరయ్య, మన శంకర వరప్రసాద్ గారు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. మిగితా సినిమాలు ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి. దీంతో హిట్ సినిమాలకు ఒకే కామన్ పాయింట్ ఉందని కొందరు అభిమానులు చెబుతున్నారు. అదే.. నటి క్యాథరిన్ ట్రెసా. వాల్తేర్ వీరయ్య, మన శంకర వరప్రసాద్ గారు సినిమాల్లో క్యాథరిన్ కీలక పాత్రలు పోషించింది. దాంతో క్యాథరిన్ చిరంజీవికి "లక్కీ చార్మ్" అంటూ ప్రచారం చేస్తున్నారు.
అలానే ఇక ఖైదీ నెం.150సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ కోసం క్యాథరిన్ ట్రెసాను ఎంపిక చేశారు. కానీ షూటింగ్ మొదలయ్యే ముందు ఆమె స్థానంలో లక్ష్మీరాయ్ ను తీసుకున్నారు. అయినా కూడా ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. దాంతో ఆ నటి విజయానికి కారణమని చెప్పడం సరైనది కాదని కొందరు వాదిస్తున్నారు. చిరంజీవి లాంటి పెద్ద స్టార్‌కు ఇప్పటికే భారీ ఫ్యాన్ బేస్ ఉంది. మంచి కథ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారని వాటికి మరే ఇతర కారణాలు వెతకొద్దని చెబుతున్నారు.

మరోవైపు కేవలం అందం ఉంటే సరిపోదు... అందుకు తోడు అదృష్టం కూడా అవసరం అనే మాటను హీరోయిన్ కేథరిన్ థెరిస్సా కెరీర్ స్పష్టంగా చూపిస్తోంది. వరుణ్ సందేశ్ నటించిన చమ్మక్ మూవీతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అయ్యింది. సుమారు 15 ఏళ్లుగా సినీ ప్రస్థానంలో 'ఇద్దరమ్మాయిలతో', 'సరైనోడు', 'బింబిసార' వంటి కొద్ది సినిమాలే ఆమెకు విజయాలుగా నిలిచాయి. ఆకట్టుకునే అందం, చక్కని నటన ఉన్నప్పటికీ ఆమెకు రావాల్సిన స్థాయి క్రేజ్ మాత్రం ఇప్పటివరకు దక్కలేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
-
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
చెప్పుతో పాటు ఆ సింబల్ చూపించిన స్టార్ బ్యూటీ.. కారణం అదే ??? -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఇండస్ట్రీలో ఉండాలంటే కమిట్మెంట్ కు ఒప్పుకోవాల్సిందే: నటి సంచలన కామెంట్స్ వైరల్ -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
రిలీజ్‌కి ముందే ప్రీ రిలీజ్ బిజినెస్‌తో రికార్డ్.. చిన్న సినిమా కాదయ్యో !! -
తెలుగులో తొలి ఏఐ సినిమా! -
అల్లు అర్జున్‌కు బాగా ఇష్టమైన మహేష్‌బాబు సినిమా -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
12 రోజుల్లో రూ.1400 కోట్లు.. చరిత్ర తిరగరాసిన ‘ధురంధర్2’ -
టాలీవుడ్ vs పొలిటీషియన్స్: డ్రగ్స్ టెస్ట్ రచ్చ!











Click it and Unblock the Notifications