నటి త్రిషకు అండగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి...
పలు సినిమాల్లో విలన్ పాత్రలు పోషించిన నటుడు మన్సూర్ అలీ ఖాన్ హీరోయిన్ త్రిషపై చేసిన వ్యాఖ్యలపై ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున దుమారం రేపాయి. అయితే, ఇప్పటికే ఈ విషయంపై చాలామంది సెలబ్రిటీలు నటి త్రిషకు అండగా నిలిచారు. ఇలాంటి వ్యాఖ్యలను సహించేది లేదంటూ చాలామంది నటులు కూడా మన్సూర్ ఆలీపై విరుచుకుపడ్డారు. ఇప్పుడు తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ విషయంపై స్పందించారు.
ప్రతి స్త్రీకి మద్దతుగా నేనుంటా : మన్సూర్ అలీ ఖాన్ చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. ఆ వ్యాఖ్యలు కేవలం ఒక ఆర్టిస్ట్‌కు మాత్రమే కాదు, ప్రతి ఒక్క మహిళకి కూడా అసభ్యకరంగా, అసహ్యంగా ఉన్నాయి. ఈ వాఖ్యలను తీవ్రంగా ఖండించాల్సిందే. వారు ఇలాంటి వక్రబుద్దితో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ విషయంలో నేను త్రిషకు అండగా నిలబడతా. కేవలం త్రిషకి మాత్రమే కాదు, ఇలాంటి అసభ్యకరమైన, భయంకరమైన వ్యాఖ్యలకు సంబంధించి ప్రతి స్త్రీకి మద్దతుగా నేను ఉంటాను అంటూ సోషల్‌మీడియాలోని తన ఖాతాలో మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ చేయడం జరిగింది. నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై త్రిష కూడా స్పందించారు. ఇలాంటి నీచమైన మనస్తత్వం కలిగిన వ్యక్తితో కలిసి పనిచేసినందుకు నేను సిగ్గుపడుతున్నాను అంటూ ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది.

మన్సూర్ అలీ ఖాన్ ఇంటర్వ్యూలో అన్నమాటలు : నటుడు మన్సూర్ అలీ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో త్రిష గురించి ఇలా మాట్లాడారు.. నేను చాలా సినిమాల్లో రేప్ సన్నివేశాల్లో నటించా. రేప్ సీన్లలో నటించడం నాకేమీ కొత్తకాదు. కానీ, లియో సినిమాలో నటి త్రిషతో రేప్ సన్నివేశాలు ఉంటాయని భావించాను. కానీ అలాంటి సీన్లేమీ ఆ సినిమాలో పెట్టలేదు. త్రిష ఈ చిత్రంలో నటిస్తుంది అని చెప్పినప్పుడు ఆమెతో బెడ్ రూమ్ లో రేప్ సీన్ ఉంటుందని భావించా. కానీ ఈ చిత్రంలో నాకు త్రిషతో అసలు సన్నివేశాలే లేవు అంటూ నవ్వుతూ కామెంట్స్ చేశాడు.
ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చిత్రపరిశ్రమలో దుమారం రేపుతున్నాయి. అయితే, ఈ వ్యాఖ్యలపై మన్సూర్ ఆలీఖాన్ కూడా స్పందించడం జరిగింది. నేను పూర్తిగా మాట్లాడింది చూడకుండా అక్కడి వరకు మాత్రమే కట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నాపై కావాలనే కొంతమంది ఇలాంటి దుష్ర్పచారాలు చేస్తున్నారు. నేను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. నన్నునెగిటివ్‌గా చూపించేందుకు ఈ ప్రయత్నాలు చేస్తున్నారంటూ పోస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications