'ఓజీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఊహించని అతిథి.. ఫ్యాన్స్ కు లైఫ్ టైమ్ సెటిల్ మెంట్..!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీస్ లో ఓజీ ఒకటి. రన్ రాజా రన్, సాహో చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుజిత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో పవన్ ఓజాస్ గంభీర పాత్రలో మెప్పించనున్నారు. ఈ చిత్రాన్ని నిర్మాత డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇటీవల పవన్ కల్యాణ్ బర్త్ డే కానుకగా విడుదల చేసిన గ్లింప్స్ సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేసింది.
ప్రస్తుతం టాలీవుడ్ పరిస్థితి విచిత్రంగా మారింది. ఎన్నో అంచనాలు వద్ద రిలీజ్ అవుతున్న పెద్ద సినిమాలు అట్టర్ ప్లాఫ్ అవుతున్నాయి. ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా విడుదలైన చిన్న సినిమాలు సంచలనాలు నమోదు చేస్తున్నాయి. దీంతో ఓ రకంగా పెద్ద సినిమా అంటేనే తెలుగు ప్రేక్షకుడు పారిపోయే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఇప్పుడు అందరి ఆశలు ఓజీ పైనే ఉన్నాయి. ఓజీ సినిమా ఈ ధోరణికి ఫుల్ స్టాప్ పెడుతుందని అటు ఫ్యాన్స్, ఇటు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇక ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సినిమా రిలీజ్ కు 18 రోజుల ముందే 50 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయని టాక్. కేవలం ఒక్క నార్త్ అమెరికా నుంచే 42 వేల టికెట్లు, 12 లక్షల డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయని సమాచారం.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రెండు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని నిర్మాతలు అనుకుంటున్నారట. ఒకటి విజయవాడ లో ఈ నెల 19 వ తేదీన నిర్వహించనున్నట్లు సమాచారం. అలాగే మరొకటి ఈ నెల 21 వ తేదీన హైదరాబాద్ లో గ్రాండ్ గా ఏర్పాటు చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే హైదరాబాద్ లో ఏర్పాటు చేసే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి వస్తారని టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే మెగా ఫ్యాన్స్ కు పండగే అని చెప్పొచ్చు.












Click it and Unblock the Notifications