పవన్ కల్యాణ్ ఆస్తులను కొనేందుకు ముందుకు వచ్చిన స్టార్ హీరో?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి అడుగుపెట్టినప్పటికీ తనదైన శైలిలో హావభావాలను పలికించడంద్వారా ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకొని అగ్రస్థాయి కథానాయకుడిగా ఎదిగారు. సమాజానికి ఏదైనా చేయాలనే తలంపుతో ఉండే పవన్ జనసేన పార్టీని స్థాపించారు. ప్రస్తుతం ఏపీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగుతున్నారు. రాజకీయ పార్టీని నడిపించాలంటే ఆషామాషీ వ్యవహారం కాదనే విషయం అందరికీ తెలిసిందే.

ప్రస్తుత తరుణంలో ఎన్నికలు అంటేనే అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయాయి. ఆర్థికంగా బలమైన అభ్యర్థులైతేనే ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను ఢీకొడతారు. అలాగే రాజకీయ పార్టీ కూడా ఆర్థికంగా జవసత్వాలు సమకూర్చుకోవాలి. ఆర్థికంగా ఎంత బలంగా ఉంటే అంత ధీటుగా ప్రత్యర్థి పార్టీలను ఢీకొట్టవచ్చు. తనకు సినిమాలద్వారా వచ్చే ఆదాయాన్ని పవన్ పార్టీని నడిపించడం కోసమే వాడుతున్నారు. ఎన్నికలు దగ్గరకు రావడంతో పార్టీని నడిపేందుకు అవసరమైన డబ్బులు కోసం తన సొంత ఆస్తులను అమ్మకానికి పెట్టారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

megastar chiranjeevi will buy to pawan kalyan properties

తాజాగా పవన్ ఆస్తులను కొనుగోలు చేసేందుకు ఓ స్టార్ హీరో మొగ్గుచూపుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఆయనెవరో కాదు.. మెగాస్టార్ చిరంజీవి. పవన్ రాజకీయ పార్టీ కోసం ఆస్తులను అమ్మేస్తే తన పిల్లలకు భవిష్యత్తులో ఏమీ మిగలకుండా పోతుందని ఆలోచించిన చిరు ఆ ఆస్తులను ఎంతుకు అమ్ముతావో చెప్పు.. కానీ వాటిని నీ పేరుమీదే ఉంచుకో.. నువ్వు ఎంతకైతే అమ్మాలనుకుంటున్నావో అంత సొమ్మును నేనిస్తాను అని చెప్పారంట. అయితే ఈ ఒప్పందానికి పవన్ కల్యాణ్ ఒప్పుకోలేదు. ఇలా అయితే నీతో మాట్లాడేది కూడా లేదు అంటూ చిరంజీవి బెదిరించడంతో పవన్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదుకానీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్ గా మారింది. తమ్ముడిని ఆదుకునేందుకు అన్న ముందుకు రావడం అనేది అన్నదమ్ముల అనుబంధానికి నిదర్శనంగా నిలుస్తోందంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+