చిరంజీవి ఫేవరెట్ యంగ్ హీరో ఇతడేనట.. వీడియో వైరల్..!
ఈ ఏడాది సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'రాజాసాబ్', మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు', నవీన్ పోలిశెట్టి 'అనగనగా ఒక రాజు' మూవీ, రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', శర్వానంద్ 'నారీనారీ నడుమ మురారీ' చిత్రాలు విడుదలయ్యాయి. అయితే వీటిలో మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు', అలాగే నవీన్ పోలిశెట్టి 'అనగనగా ఒక రాజు' మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించాయి.
ఈ నేపథ్యంలో ఇటీవల నవీన్ పోలిశెట్టి 'అనగనగా ఒక రాజు' మూవీ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన టాలీవుడ్ డైరెక్టర్ బాబీ.. నవీన్ పొలిశెట్టిని ఉద్దేశించి మాట్లాడారు. 'నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి నవీన్. మెగాస్టార్ చిరంజీవితో నేను త్వరలో ఒక సినిమా చేయబోతున్నాను. అందుకోసం రీసెంట్ గానే మా మధ్య ఓ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో ఆయన 'అనగనగా ఒక రాజు' చిత్రం బాగుంది అంట కదా బాబీ అది అడిగారు. దానికి నేను అవును సార్ అని చెప్పాను.

దానికి చిరంజీవి.. ఆ అబ్బాయి నవీన్ పోలిశెట్టి ఎంత ఎనర్జీ గా, ఎంత అద్భుతంగా చేస్తాడు. ఇప్పుడు వస్తున్న కుర్రాళ్లలో నాకు బాగా నచ్చిన హీరో అతను అని చెప్పారు. ఇది నేను ఇప్పటి వరకు నీతో చెప్పలేదు. ఈ సక్సెస్ మీట్ లో రివీల్ చేస్తే బాగుంటుందని ఇక్కడ చెప్తున్నాను' అంటూ డైరెక్టర్ బాబీ తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఇక టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి అరుదైన ఘనత సాధించాడు. తన లేటెస్ట్ సినిమా 'అనగనగా ఒక రాజు' తో రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయాడు. ఆయన హీరోగా డైరెక్టర్ మారి తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజైంది. సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.












Click it and Unblock the Notifications