Most Viewed Web Series In India 2024 : భారత్‌లో హైయెస్ట్ వ్యూస్ అందుకున్న వెబ్ సిరీస్‌లివే..!
భారత చిత్ర పరిశ్రమ కరోనాకు ముందు కరోనా తర్వాత గా చెప్పుకోవచ్చు. కొవిడ్-19 లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితం కావడం ఈ క్రమంలో ఓటీటీల ప్రభావం పెరిగిపోయింది. మూవీ లవర్స్ సినిమా చూసేందుకు థియేటర్ కు వెళ్లకుండా ఇంట్లోనే హాయిగా సినిమాను ఆస్వాధిస్తున్నారు. అంతేకాక థియేటర్లలో రిలీజైన మూవీస్ ఇప్పుడు నెలరోజుల్లో అమెజాన్, నెట్ ఫ్లిక్స్, జియో సినిమాల ఓటీటీల్లో విడుదల అవుతున్నాయి. దీంతో ప్రేక్షకులు ఓటీటీలకు ఫుల్ గా అలవాడు పడిపోయారు.
మీర్జాపూర్ సీజన్ 3 టాప్
ఇందులో భాగంగానే ఆర్‌మ్యాక్స్ అనే మీడియా సంస్థ.. భారత్ లో ఓటీటీల ప్రభావం ఎంత వరకు ఉంది. ఏ ఏ వెబ్ సిరీస్ లు సినీప్రియులు బాగా చూస్తున్నారని వెల్లడించింది. ఆర్ మ్యాక్స్ నిర్వహించిన సర్వేలో హిందీ విభాగంలో అమెజాన్ ప్రైమ్ లో మీర్జాపూర్ సీజన్ 3 టాప్ ప్లేస్ లో ఉన్నట్లు తేలింది. పేరుకు హిందీ సిరీస్ అయినా దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది 'మీర్జాపూర్ 3' మూవీ 2024లో అత్యధికంగా వీక్షించిన వెబ్‌సిరీస్‌గా ఇది రికార్డు సృష్టించింది.

ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వేదికగా అందుబాటులో ఉన్న ఈ సిరీస్‌ను దాదాపు 30.8 మిలియన్ల మంది చూశారని ఓ సర్వేలో తేలింది. అంతేకాదు, వివిధ ఓటీటీ వేదికల్లో అత్యధిక వ్యూవర్షిప్ సాధించిన వెబ్‌సిరీస్‌లు, సినిమాలకు సంబంధించిన వివరాలనూ ఆ సంస్థ వెల్లడించింది. 'మీర్జాపూర్ 3' తర్వాత అత్యధికంగా 'పంచాయత్3' సిరీస్‌ను ప్రజలు వీక్షించినట్లు తెలుస్తోంది. 28.2 మిలియన్ల వ్యూస్ తో 'పంచాయత్ 3' రెండో ప్లేస్ లో ఉంది. ఈ రెండింటి తర్వాత 21.5 మిలియన్ వ్యూవర్స్‌తో 'హీరామండి: ది డైమండ్ బజార్' మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది.

ప్రపంచవ్యాప్తంగా 'స్క్విడ్ గేమ్2'
ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ లవర్స్‌ను ఆకట్టుకున్న వెబ్‌సిరీస్‌ల్లో 'స్క్విడ్ గేమ్2' ఒకటి. 2024 డిసెంబర్లో నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిన ఈ సిరీస్ స్ట్రీమింగ్‌కు వచ్చిన కొద్ది రోజుల్లోనే రికార్డులు తిరగరాసింది. ఇప్పటివరకూ 'మనీ హెయిస్ట్' పేరిట ఉన్న వ్యూవర్షిప్ను దాటేసింది. అంతేకాకుండా భారత్‌లోనూ ఈ సిరీస్ బాగానే పాపులర్ అయ్యిందని ఆర్‌మ్యాక్స్ తమ నివేదికలో వివరించింది.
ఇదిలా ఉండగా, నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చిన సినిమాల్లో టాప్-15లో 11 చిత్రాలు నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చినవే కావటం విశేషం. వీటిలో 'దోపత్తి'(15.1 మిలియన్), 'సెక్టార్ 36' (13.9మిలియన్) 'సికిందర్ కా ముకద్దార్' (13.5మిలియన్) ఉన్నాయి. ఇక 2024లో అత్యధిక మంది లైక్ చేసిన సిరీస్‌గా 'పంచాయత్3' నిలిచింది. అలాగే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'మహారాజ' చిత్రాన్ని ఎక్కువ మంది ప్రేక్షకులు చూశారు.
ప్రాంతీయ భాషల్లో టాప్ ఇవే..
హిందీనే కాకుండా పలు రీజనల్ భాషల్లోనూ విడుదలైన సిరీస్‌లను చూసేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు ఆర్‌మ్యాక్స్ నివేదిక తెలిపింది. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో డిస్నీ+హాట్‌స్టార్ టాప్ పొజిషన్‌ను సొంతం చేసుకుంది. 'సేవ్ ది టైగర్స్: సీజన్2'ను 5 మిలియన్ వ్యూవ్స్‌తో టాప్‌లో ఉండగా, సుమారు 4.9 మిలియన్ వ్యూవ్స్‌తో బుజ్జి అండ్ భైరవ రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ రిషి అనే తమిళం సిరీస్ కూడా అత్యధిక వ్యూవ్స్‌తో టాప్‌లో ఉంది.
మరోవైపు ప్రాంతీయంగానూ ఇంటర్నేషనల్ కంటెంట్ చూసే వారి సంఖ్య భారీగానే ఉందని తెలుస్తోందని ఆ నివేదికలో పేర్కొంది. 'హౌస్ ఆఫ్ డ్రాగన్2', 'స్క్విడ్ గేమ్2', 'రోడ్ హౌస్' లాంటి సిరీస్‌లకు ఇక్కడ విశేష ఆదరణ లభించింది.












Click it and Unblock the Notifications