ప్రభాస్ సినిమాలో నటించి తప్పు చేశా..!

తెలుగు ప్రేక్షకులకు సీరియల్స్ మీద ఉన్న అభిమానం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా అప్పట్లో సెన్సేషన్ సృష్టించిన చక్రవాకం, మొగలి రేకులు సీరియల్స్ క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. 'చక్రవాకం' సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులకి పరిచయమైన సాగర్.. 'మొగలిరేకులు' సీరియల్ తో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆర్కే నాయుడు పాత్ర ఆయనను ప్రతి ఒక్కరికీ బాగా కనెక్ట్ చేసింది. ఆ తర్వాత ఎన్ని సీరియల్స్‌లో చేసినా ఆ క్యారెక్టర్ పాత్ర మాత్రం ప్రేక్షకులకి అలా గుర్తుండిపోయింది.

సీరియల్ ద్వారా వచ్చిన క్రేజ్ తోనే సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు సాగర్. 'సిద్ధార్థ్' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా అంతగా క్లిక్ కాలేదు. ఆ తర్వాత షాదీ ముబారక్ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం " ది 100 " అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సైబర్‌ క్రైమ్స్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి రాఘవ్‌ ఓంకార్‌ శశిధర్‌ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా జూలై 11న రిలీజ్‌ కానున్న తరుణంలో.. ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు సాగర్‌.

mogalirekulu-fame-sagar-shocking-comments-on-prabhas-movie

ఇంటర్వ్యూలో సాగర్ మాట్లాడుతూ.. ప్రభాస్ సినిమాలో నటించి తప్పు చేశా అంటూ వ్యాఖ్యానించారు. అంతే కాకుండా ఆ మూవీ చేసిన భయంతోనే మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నా అని కామెంట్స్ చేయడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో సైతం ఫుల్ వైరల్ అవుతోంది.

నేను చేసిన తప్పు అదే..!

సాగర్ ఏమన్నారంటే.. నా లైఫ్‌లో మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ సినిమా చేయడం నేను చేసిన తప్పు.. ఆ సీరియల్‌ పీక్స్‌లో ఉన్నప్పుడు మూవీలో ఛాన్స్‌ వచ్చింది. అందులో సెకండ్‌ లీడ్‌ నాదే అన్నారు. పెద్ద బ్యానర్‌ అని ఒప్పుకున్నాను. అప్పటివరకు నాకు సినిమాలపై పెద్దగా అవగాహన లేదు. సీరియల్‌ టీమ్‌ను ఎలాగోలా ఒప్పించి మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ టీమ్‌కు 15 రోజులు డేట్స్‌ ఇచ్చాను. మొదటి మూడురోజులు నాకు షూటింగ్‌ లేదు. అనుమానం వచ్చి డైరెక్టర్‌ దశరథ్‌ను అడిగితే రేపు నీ సీన్‌ ఉంటుందన్నాడు. అలా నాపై రెండు మూడు సీన్లు తీశారు. నాకు చెప్పిన క్యారెక్టర్‌ ఇది కాదు కదా అనిపించింది. అదే విషయం అడిగితే అందుకు డైరెక్టర్.. అప్పుడప్పుడు క్యారెక్టర్లు మారుతుంటాయి అర్థం చేసుకోండి అన్నారు. దాంతో నేను చేయాలనుకుంది ఇది కాదు కదా అనిపించి బయటకు వచ్చేశాను అన్నారు.

అంతే కాకుండా నా సీన్లు తీసేయమన్నాను. ఎందుకంటే డబ్బు కోసం సినిమా చేయట్లేదు, వెండితెరపై నా ఎంట్రీ బాగుండాలని చేశానంతే! నా క్యారెక్టర్‌ను తీసేసి వేరే పాత్రను హైలైట్‌ చేసుకోండి అని చెప్పాను. అయినప్పటికీ సినిమాలో నా రోల్‌ అలాగే ఉంచారు. ఆ సినిమా ఇంపాక్ట్‌ నా కెరీర్‌పై ప్రభావం చూపించింది. ఆ మూవీ రిలీజయ్యాక చాలామంది అలాంటి రోల్‌ చేశావేంటి? అని అడిగారు. అప్పుడే మంచి సినిమాలు చేయాలని డిసైడయ్యాను అని చెప్పుకొచ్చారు.

రంగస్థలం రిజెక్ట్‌..

ఆ తర్వాత రంగస్థలం మూవీలోనూ ఆఫర్‌ వచ్చింది. కానీ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ సినిమాలో లానే నా పాత్రను ఎటు తిప్పుతారో ఏంటోనని భయపడి ఆగిపోయాను. ఆ తర్వాత హీరో ఆదిగారిని సంప్రదించారని తెలిసింది. ఆయన కూడా ఒప్పుకోలేదు. కొద్దిరోజులకు ఇద్దరం ఒకేసారి ఒప్పుకున్నాం. అప్పటికే ఆది.. సుకుమార్‌కు ఫోన్‌ చేసి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో తనను సెలక్ట్‌ చేశారు అని చెప్పుకొచ్చాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+