ప్రభాస్‌తో నటించి తప్పు చేశాను..!
ప్రభాస్ క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా బహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాతో ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు. నార్త్ జనాలు సైతం ప్రభాస్ యాక్షన్‌కు ఫిదా అయిపోయారు. సాహో సినిమా తెలుగులో కన్నా బాలీవుడ్‌లోనే ఎక్కువ కలెక్షన్స్ సాధించిందంటే అక్కడ ప్రభాస్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో నిరాశ పర్చిన ప్రభాస్, సలార్, కల్కి వంటి వరుస హిట్లతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన స్టామినా నిరూపించాడు. ప్రభాస్ ప్రస్తుతం సలార్-2,ఫాజీ, కల్కి-2 ,సినిమాల్లో నటిస్తున్నాడు.
దీంతో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమాకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ఆయన నటిస్తూన్న రాజాసాబ్ సినిమా షూటింగ్ 90 శాతం పూర్తి అయింది.ఈ ఏడాదిలో ఈ సినిమాను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రభాస్‌తో నటించాలని చాలామంది కోరుకుంటారు.అలాంటిది ప్రభాస్‌తో నటించి తప్పు చేశానని ఓ నటుడు వ్యాఖ్యానించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఇలా కామెంట్ చేసిన నటుడు మరెవరో కాదు..మొగలిరేకులు టీవీ సీరియల్ హీరో సాగర్. బుల్లితెరపై మొగలిరేకులు సీరియల్ ఎంతటి హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఆర్కే నాయుడు పాత్రలో సాగర్ అద్భుతంగా నటించారు.ఇంకా చెప్పాలంటే హీరోలతో సమానంగా సాగర్ క్రేజ్ సంపాదించుకున్నారు. సాగర్ ఆ తర్వాత హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా 'ది 100' సినిమాలో లీడ్ రోల్‌లో నటించారు.
ఈ సినిమా జులై 11న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సాగర్ ప్రభాస్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. సాగర్ ప్రభాస్‌తో కలిసి మిస్టర్ పర్ఫెక్ట్ అనే సినిమాలో నటించారు. ఈ సినిమాలో ప్రభాస్ స్నేహితుడిగా ఆయన కనిపించాడు. మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ సమయంలో బుల్లితెరపై నేను చాలా బిజీగా ఉన్నాను. తెలుగు ప్రేక్షకులంతా నన్ను తమ ఇంట్లో కుర్రాడిలా ఆదరించారు. ఆ టైంలో మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రంలో నాకు ఒక ఆఫర్ వచ్చింది. టీవీ సీరియల్ యూనిట్ నుండి కష్టపడి డేట్‌లు సర్దుబాటు చేసుకుని, ఒక మంచి అవకాశం అనుకుని సినిమాలో నటించినప్పటికీ, మీ పాత్రకు సరైన ప్రాధాన్యత లభించకపోవడం బాధాకరమని ఆయన తెలిపారు.
ఎంతగానో శ్రమించి, టీవీ సీరియల్ నుండి సమయాన్ని సర్దుబాటు చేసుకున్నా, ఫలితం లేదని సాగర్ వెల్లడించాడు. ఇలా మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాతో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆయన చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications