త్వరగా పెళ్లి చేసుకొని.. అర డజను మంది పిల్లలని కను బావ !
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. నేడు తన 46వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ప్రభాస్ పుట్టినరోజు అంటే అభిమానులకు పండుగ రోజులా మారిపోయింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్, సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాది మరియు ఓవర్సీస్‌లో కూడా "హ్యాపీ బర్త్‌డే డార్లింగ్" అంటూ ఫ్యాన్స్ భారీగా సంబరాలు జరుపుకుంటున్నారు. దీంతో ప్రభాస్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారిపోయారు.
ప్రభాస్ వ్యక్తిగత వివరాలు..
ప్రభాస్ పూర్తి పేరు వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు. ఆయన 1979 అక్టోబర్ 23న జన్మించారు. వీరి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు. ప్రభాస్, ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు, శివ కుమారి దంపతులకు రెండో సంతానంగా జన్మించారు. కృష్ణంరాజు వారసుడిగా 2002లో ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ తెరంగేట్రం చేశారు.

2004లో త్రిష సరసన నటించిన 'వర్షం' ప్రభాస్ కి మంచి గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత అడవి రాముడు, చక్రం సినిమాల్లో నటనకు గుర్తింపు దక్కినా కానీ.. చిత్రాలు పరాజయం పాలయ్యాయి. 2005లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఛత్రపతి' బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఆ తర్వాత డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ , మిర్చి వంటి బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అదరగొట్టిన ప్రభాస్.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించాడు.
ఇక ఆ నెక్స్ట్ నుంచి రికార్డ్స్ తిరగరాస్తూనే ఉన్నారు. 2017లో బ్యాంకాక్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రభాస్ మైనపు ప్రతిమను ఉంచడం ఆయనకు దక్కిన అరుదైన గౌరవంగా చెప్పవచ్చు. దక్షిణాది నటుల్లో ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తి ప్రభాస్.
మోహన్ బాబు ఇంట్రెస్టింగ్ పోస్ట్..
ప్రభాస్‌కు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చేసిన బర్త్‌డే విషెస్ మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మోహన్ బాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. "మై డియర్ డార్లింగ్ బావా".. "నువ్వు సినీ జాతి మొత్తానికి ఒక గర్వకారణం," అంటూ ప్రశంసించారు. నీ జీవితం అపరిమితమైన సంతోషంతో నిండిపోవాలి.. ఇలాగే మరిన్ని పుట్టినరోజులు గ్రాండ్‌గా జరుపుకోవాలని అన్నారు. వందేళ్లపాటు ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండాలని కోరుకున్నారు.
"అరడజన్ పిల్లలతో సంతోషంగా ఉండు"..
అంతే కాకుండా ప్రభాస్ పెళ్లి గురించి మోహన్ బాబు ఫన్నీగా ప్రస్తావించారు. నువ్వు త్వరగా పెళ్లి చేసుకుని, అరడజన్ నుంచి ఏకంగా ఒక డజన్ మంది పిల్లలు కూడా కలగాలని.. సంతోషమైన జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పటికీ ఈ బావ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు" అని పేర్కొన్నారు. మోహన్ బాబు చేసిన ఈ సరదా వ్యాఖ్యలు నెట్టింట ఫన్నీ కామెంట్స్‌కు దారి తీశాయి.
My Dear Darling Bava #Prabhas , the pride of the entire nation —May you be blessed with endless happiness, and celebrate many more birthdays in grand style, may you live in good health and joy for a hundred years,
— Mohan Babu M (@themohanbabu) October 23, 2025
And may you soon get married and live a happy life with half a… pic.twitter.com/tiPFY5t7Vu
గతంలో మోహన్ బాబు, ప్రభాస్ కలిసి 'బుజ్జిగాడు' సినిమాలో నటించారు. ఆ సినిమాలో ప్రభాస్, మోహన్ బాబు సోదరి త్రిషను ప్రేమిస్తాడు. ఆ సందర్భంలోనే తెరపై వీళ్ళిద్దరూ 'బావ, బావమరిది' అని పిలుచుకున్నారు. అప్పటినుంచి బయట కూడా అలాగే పిలుచుకుంటూ మంచి రిలేషన్‌ను మెయింటైన్ చేస్తున్నారు. ఈ అనుబంధం కారణంగానే మోహన్ బాబు 'కన్నప్ప' సినిమాలో ప్రభాస్ ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు. ఈ సినిమాలో దాదాపు 30 నిమిషాల పాటు ఉండే ఈ పాత్రకు ప్రభాస్ ఎలాంటి రెమ్యూనరేషన్ లేకుండానే నటించినట్లు సమాచారం.
-
సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న "త్రిష".."విజయ్" బాటలోనే పాలిటిక్స్ లోకి !! -
OTT: దుమ్ములేపుతున్న కొత్త మూవీస్, ఈ వారం ఫుల్ లిస్ట్ ఇదే! -
ప్రేమ్ రక్షిత్ మాస్టర్‌కు "మైఖేల్ జాక్సన్" కొరియోగ్రాఫర్ ప్రశంసలు.. -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
తెలుగు సినీ ఇండస్ట్రీలో ‘ముగ్గురు మొనగాళ్లు’ ఎవరో తెలుసా? -
దర్శకుడు రాజమౌళి ఇంటి కోడలు కాబోతున్న తెలుగు హీరోయిన్..! -
ఎనిమిదేళ్లుగా వేధిస్తున్నారు.. ఇక ఊరుకోను: రష్మిక సంచలన పోస్టు.. -
ఊపిరి ఆపేసే గ్లింప్స్ వచ్చేసింది.. వణికిస్తున్న హారర్ థ్రిల్లర్..! -
Mr work From Home : మీ టైటిల్‌కి.. మీ ప్రమోషన్లకి హ్యాట్సాఫ్ !! -
రాజేంద్ర ప్రసాద్‌కి హీరో విశాల్ వార్నింగ్.. క్షమాపణ చెప్పాల్సిందే !! -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
లారీ ఎక్కి వెళ్లి కృష్ణ సినిమాలు చూసేవాడిని: సీఎం రేవంత్












Click it and Unblock the Notifications