నీకెంత ధైర్యం.. విడుదలకు ముందు సినిమాను యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తావ్
కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన విజయ్ ఆంటోని, ఈసారి భద్రకాళి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పొలిటికల్ లాబీయింగ్ అనే కొత్త పాయింట్‌తో వచ్చిన ఈ సినిమా, ఆరంభంలో ఆసక్తిని రేకెత్తించింది. సినిమా మీద నమ్మకంతో యూట్యూబ్‌లో ఓ క్లీప్‌ను విడుదల చేశారు.
భద్రకాళి సినిమా కథ కిట్టు (విజయ్ ఆంటోని) అనే పొలిటికల్ లాబీయిస్ట్ చుట్టూ తిరుగుతుంది. ముఖ్యమంత్రుల నుంచి కేంద్ర మంత్రుల వరకు ప్రభావితం చేయగల సామర్థ్యం ఉన్న కిట్టు, వ్యవస్థకు సమాంతరంగా ఒక వ్యవస్థను నడిపిస్తుంటాడు. ఈ పాయింట్ తో సినిమా ప్రారంభం చాలా ఆసక్తికరంగా సాగుతుంది. విజయ్ ఆంటోని పాత్ర ఎలివేషన్లు, ఆయన వేసే ప్లాన్లు, అధికారులను మేనేజ్ చేసే తీరు ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయి. ఫస్టాఫ్ వరకు సినిమా మంచి వేగంతో సాగి, ఇంటర్వెల్ లో ఆసక్తికరమైన ట్విస్ట్ తో ముగుస్తుంది.

అయితే, ఇంటర్వెల్ తర్వాత కథనం పూర్తిగా నెమ్మదిస్తుంది. కిట్టు గతం, పగ గురించి చెప్పే సన్నివేశాలు నిడివి ఎక్కువై బోర్ కొట్టించాయి. ముఖ్యంగా, హీరో పాత్రలో భావోద్వేగాలు సరిగా పండలేదు. దర్శకుడు అరుణ్ ప్రభు ఎంచుకున్న పాయింట్ కొత్తదే అయినా, ఏం చెప్పాలనుకున్నారనే విషయంలో స్పష్టత లోపించింది. వ్యవస్థలోని లోపాలను చూపించాలనుకున్నారా, రాజకీయ నాయకుల మోసాలను చూపాలనుకున్నారా, లేదా ఒక వ్యక్తిగత పగను హైలైట్ చేయాలనుకున్నారా అనే గందరగోళం కనిపిస్తుంది.
విజయ్ ఆంటోని నటనలో పాత సీరియస్ లుక్ నే కొనసాగించారు. సునీల్ కిర్పలాని, కిరణ్ వంటి నటులు తమ పాత్రల్లో బాగా నటించారు. షెల్లీ కాలిస్ట్ కెమెరా వర్క్, విజయ్ ఆంటోని అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. కానీ, నెమ్మదిగా సాగే కథనం, పేలవమైన క్లైమాక్స్ ఈ సినిమాకు మైనస్‌గా మారాయి. మొత్తంగా భద్రకాళి ఒక ఆసక్తికరమైన పాయింట్‌తో మొదలై, దారి తప్పిన పొలిటికల్ థ్రిల్లర్‌గా మిగిలిపోయింది.












Click it and Unblock the Notifications