ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు? సిరీస్‌లు ఇవే..!
ఉగాది, శ్రీరామ నవమి పండుగలను పురస్కరించుకొని ఏప్రిల్ మొదటి వారంలో పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ క్రమంలోనే ఏప్రిల్ రెండో వారంలో కూడా థియేటర్లో, ఓటీటీలో సందడి చేసేందుకు మరికొన్ని సినిమాలు రెడీ అయ్యాయి. ఇక ఈ వారంలో టాలీవుడ్ ప్రేక్షకుల అందరి చూపు మాత్రం సిద్దు జొన్నలగడ్డ, వైష్ణవి నటించిన 'జాక్', యాంకర్ ప్రదీప్, దీపికా పిల్లి జంటగా నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా పైనే ఉన్నాయి. వీటితో పాటు పలు డబ్బింగ్ చిత్రాలు సైతం రిలీజ్ కాబోతున్నాయి.
అలానే గత వారం టాలీవుడ్ లోని పెద్ద హీరోల సినిమాలు ఏవి రిలీజ్ కాలేదు. ఇక ఈ వారంలో కూడా తెలుగు చిత్ర పరిశ్రమలోని పెద్ద హీరోలు సినిమాలు ఏవి రిలీజ్ కి నోచుకోలేదు. కానీ కోలీవుడ్ నటుడు అజిత్, బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ చిత్రాలు తెలుగులో కూడా విడుదల కాబోతుండడం కొంత ఊరట నిస్తుంది.

ఈ వారం థియేటర్లో రిలీజ్ కాబోతున్న చిత్రాలు..
జాక్...
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ, యంగ్ బ్యూటీ వైష్ణవి చైతన్య కలిసి నటించిన చిత్రం 'జాక్'. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ తరువాత చాలా గ్యాప్ తీసుకొని బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఎస్వీసీసీ బ్యానర్ మీద బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. టిల్లు, టిల్లు స్క్వేర్ తరువాత వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకున్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచాయి. ఏప్రిల్ 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఓ రహస్య ఆపరేషన్ కోసం రంగంలోకి దిగిన జాక్ అనే యువకుడిగా సిద్ధు నటిస్తున్నాడు.
ఇన్నాళ్లు లవ్ స్టోరీల మీదే ఫోకస్ పెట్టినా బొమ్మరిల్లు భాస్కర్.. ఈసారి ట్రాక్ మార్చి యాక్షన్ సీక్వెన్స్‌లను కూడా తెరకెక్కించడం అంచనాలను డబుల్ చేస్తోంది. ఈ మూవీతో సిద్ధు హ్యాట్రిక్ కొనసాగిస్తారా ? బొమ్మరిల్లు భాస్కర్ సక్సెస్ దక్కించుకుంటారా అనేది ప్రేక్షకులు నిర్ణయించాల్సి ఉంది.
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి..
ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితుడే. బుల్లితెరపై పలు కార్యక్రమాలకు యాంకరింగ్ చేసి తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. యాంకరింగ్ చేస్తూనే అటు వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇప్పటికే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా.. అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ చిత్రం ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది.
ఇక ఇప్పుడు మళ్లీ కొంచెం గ్యాప్ తీసుకొని 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నితిన్- భరత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో దీపికా పిల్లి హీరోయిన్ గా నటిస్తుండగా.. ఏప్రిల్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పైగా పవన్ కళ్యాణ్ ఫస్ట్ సినిమా టైటిల్ కావడంతో మంచి అంచనాలే నెలకున్నాయి.
కౌసల్య తనయ రాఘవ..
స్వామి పట్నాయక్ దర్శకత్వంలో రాజేశ్ కొంచాడా, శ్రావణి శెట్టి జంటగా నటించిన చిత్రం 'కౌసల్య తనయ రాఘవ'. రాముడు, రావణుడు కాన్సెప్ట్ సినిమాకి ప్రధాన ఆకర్షణ అని చిత్ర బృందం పేర్కొంది. ఈ ప్రేమకథ ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
జాట్...
బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్.. తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'జాట్'. సయామీ ఖేర్, రెజీనా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ ఈ నెల 10న రిలీజ్ కానుంది. ఓ తీర ప్రాంతంలోని గ్రామాన్ని శాసించే విలన్‌కు హీరో ఎలా బుద్ధి చెప్పాడన్నది ఈ సినిమా స్టోరీగా తెలుస్తోంది.
గుడ్ బ్యాడ్ అగ్లీ...
రీసెంట్ గానే 'పట్టుదల' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు అజిత్. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. ఈ క్రమంలోనే అజిత్ - త్రిష జోడీ మరోసారి 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాతో సందడి చేసేందుకు రెడీ అయ్యారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. యాక్షన్ కామెడీ నేపథ్యంతో రూపొందిన ఈ మూవీలో అజిత్ లుక్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.
ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు..
నెట్‌ఫ్లిక్స్..
కోర్టు - సినిమా - తెలుగు - ఏప్రిల్ 11
పెరుసు - సినిమా - తెలుగు - ఏప్రిల్ 11
ఫ్రోజెన్ హాట్ బాయ్స్ - సినిమా - ఇంగ్లిష్ - ఏప్రిల్ 10
కిల్ టోనీ - వెబ్ సిరీస్ - ఇంగ్లిష్ - ఏప్రిల్ 7
బ్లాక్ మిర్రర్ 7 - వెబ్ సిరీస్ - ఇంగ్లిష్ - ఏప్రిల్ 10
అమెజాన్ ప్రైమ్..
ఛోరీ 2 - సినిమా - హిందీ - ఏప్రిల్ 11
జియో హాట్ స్టార్..
ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ 6 - యానిమేషన్ సిరీస్ - హిందీ - ఏప్రిల్ 11
ఈటీవీ విన్..
టుక్ టుక్ - సినిమా - తెలుగు - ఏప్రిల్ 10












Click it and Unblock the Notifications