మోగ్లీ రివ్యూ: రోషన్ కనకాల కనెక్ట్ అయ్యాడు భయ్యో..!!
స్టార్ యాంకర్ సుమ కనకాల కుమారుడు రోషన్ కనకాల హీరోగా నటించిన రెండో చిత్రం 'మోగ్లీ' (Mowgli) డిసెంబర్ 13న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. జాతీయ అవార్డు గ్రహీత సందీప్ రాజ్ (కలర్ ఫోటో ఫేమ్) దర్శకత్వం వహించిన ఈ సినిమాపై సోషల్ మీడియాలో భారీ అంచనాలు నెలకొన్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి ట్విట్టర్ వేదికగా చర్చనీయాంశంగా మారింది.
యాక్షన్ & ఎమోషన్స్:
రోషన్ కనకాల పూర్తిగా మేక్‌ఓవర్ అయ్యి, ఒక మ్యాన్ ఆఫ్ ది జంగిల్‌గా (అడవి మనిషిగా) కనిపించడం ఆకట్టుకుంటుందని సినిమా చూసినవారు అభిప్రాయపడుతున్నారు.రోషన్ చూపించిన ఇంటెన్స్ యాక్షన్, లుక్ ట్రాన్స్‌ఫర్మేషన్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా, క్లైమాక్స్‌లో రోషన్ తాడులు లేకుండా సాహసోపేతంగా యాక్షన్ సన్నివేశాలు చేశాడనే విషయం తెలిసి అభిమానులు ఆశ్చర్యపోయారు.

యాక్షన్ రొమాన్స్:
ఇది ప్రేమ, కామం మధ్య జరిగే యుద్ధాన్ని చూపించే రొమాన్స్ డ్రామా అని, దానిని యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మలచడం కొత్తగా ఉందని సినీ అభిమానులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా, వినికిడి లోపం ఉన్న డ్యాన్సర్‌తో (సాక్షి మడాల్కర్) ప్రేమ కథ ఆసక్తికరంగా ఉందని భావిస్తున్నారు.
కాలభైరవ మ్యూజిక్:
ఈ చిత్రానికి సంగీతం అందించిన కాల భైరవ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉందని, యాక్షన్ ఘట్టాలకు ఆఫ్రికన్ వార్ డ్రమ్స్ ఉపయోగించడం కొత్త అనుభూతిని ఇస్తుందని సినిమా చూసిన వారు పేర్కొన్నారు.
ప్రభాస్ రిఫరెన్సులు:
'బాహుబలి'ని గుర్తుచేసే షాట్లు,విలన్ నటన 'వర్షం'లో గోపీచంద్‌ను పోలి ఉండటం,అలాగే వైవా హర్ష డైలాగుల్లో ప్రభాస్ ప్రస్తావన రావడం... ప్రభాస్ అభిమానులను కూడా ఆకర్షించేలా ఉందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
వివాదం & క్షమాపణ: సెన్సార్ టాక్
ఈ సినిమా విడుదలకు ముందు సెన్సార్ బోర్డుతో సంబంధించిన చిన్న వివాదం కూడా చర్చనీయాంశమైంది. విలన్ పాత్రధారి బండి సరోజ్ కుమార్ సెన్సార్ బోర్డుపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో, నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వెంటనే క్షమాపణలు చెప్పింది. ఈ వివాదం కూడా సినిమాకు మరింత బజ్ తీసుకొచ్చింది.ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని సింగిల్ స్క్రీన్‌లలో 'మోగ్లీ' టికెట్‌ను కేవలం ₹99కే అందిస్తున్నట్లు ప్రకటించడం... ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించడానికి చిత్ర బృందం చేస్తున్న ప్రయత్నంగా సోషల్ మీడియాలో ప్రశంసలు దక్కాయి.
మొత్తానికి, 'మోగ్లీ' ఒక లార్జర్-దన్-లైఫ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉందని, సందీప్ రాజ్ దర్శకత్వంలో రోషన్ కనకాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాడని సినిమా చూసిన వారు చెబుతున్నారు.డిసెంబర్ 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
రివ్యూ: 3/5
నటీనటులు సాంకేతిక బృందం
- సినిమా: మోగ్లీ
- నటీనటులు: రోషన్ కనకాల,సాక్షిమడోల్కర్,బండి సరోజ్ కుమార్,వైవా హర్ష
- సంగీతం: కాలభైరవ
- ఎడిటర్: కోదాటి పవన్ కళ్యాణ్
- నిర్మాతలు: టి.జి. విశ్వప్రసాద్,కృతిప్రసాద్
- రచన-దర్శకత్వం: సందీప్ రాజ్
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications