అతనితో డేటింగ్ చేశా..సెట్ కాలేదు..అందుకే వదిలేశా - మృణాల్ ఠాకుర్
మృణాల్ ఠాకుర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'సీతారామం' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారింది. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమాతో మృణాల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది . తొలి సినిమాతోనే తన అందం అభినయంతో కట్టిపడేసింది. సీతామహాలక్ష్మీ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. తొలి సినిమాతోనే మంచి విజయం సాధించింది. ఆతర్వాత తెలుగులో ఈ అమ్మడి క్రేజ్ పెరిగిపోయింది.
మృణాల్ ఠాకూర్.. తెలుగులో తక్కువ సమయంలోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత నేచురల్ స్టార్ నానితో కలిసి 'హాయ్ నాన్న' అనే సినిమా చేసింది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. 'హాయ్ నాన్న' తర్వాత ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఫ్యామిలి స్టార్ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.కానీ మృణాల్ నటనకు మాత్రం మంచి పేరు వచ్చింది.

తన నటనతో మృణాల్ మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తెలుగుతో పాటు, బాలీవుడ్ సినిమాల్లో కూడా వరుస ఆఫర్లు కొట్టేస్తోంది. అయితే తెలుగులో కన్నా బాలీవుడ్‌లో ఈ భామ సెటిల్ కావాలని చూస్తున్నట్టు అనిపిస్తోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మృణాల్ ఠాకుర్ ఎప్పటికప్పుడు సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా తన వ్యక్తిగత అకౌంట్‌లో పోస్ట్ చేస్తుంటారు. మృణాల్ ఠాకూర్ తాజాగా తన బ్రేకప్ స్టోరీ గురించి చెప్పుకొచ్చింది.
తనకు ఏడు నెలల క్రితమే బ్రేకప్ జరిగిందని, అయినా పెద్దగా బాధపడట్లేదని చెప్పుకొచ్చింది. ఓ పాడ్ కాస్ట్‌లో తన లవ్ స్టోరీ, బ్రేకప్ విషయాలు చెప్పుకొచ్చింది మృణాల్ ఠాకూర్. మనకు సూట్ అయ్యే వ్యక్తి మన జీవితంలోకి వచ్చే వరకు.. వచ్చి, వెళ్లిపోయే వాళ్లు వెళ్తూనే ఉంటారని హాట్ కామెంట్స్ చేసింది. మీకు ఎవరు సెట్ అవుతారో మీకే తెలుస్తుంది. ఇక నా లైఫ్ లో గతంలో ఓ వ్యక్తితో డేటింగ్ చేశా.
అయితే సినీ నటితో అతడికి రిలేషన్ ఎందుకో నచ్చలేదు. పద్ధతిగల కుటుంబం నుంచి వచ్చానని చెప్పాడు. దాంతో ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నాం. అంతెందుకు ఏడు నెలల క్రితం కూడా ఒకరితో నాకు బ్రేకప్ అయ్యింది. ఇక నేను చేసుకోబోయేవాడికి అందంగా లేకపోయినా పర్వాలేదు, మంచి గుణముండాలి. ఇప్పటి వరకు నా లైఫ్ లో బ్రేకప్స్ జరిగాయి. కానీ మరీ బాధపడేంతగా ఏం జరగలేదంటూ మృణాల్ ఠాకూర్ చెప్పుకొచ్చింది. మృణాల్ ఠాకూర్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications