దానికి 'నో' చెప్పా.. అందుకే తగ్గాయి: మృణాల్ ఠాకూర్

యంగ్ బ్యూటీఫుల్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ వరుసపెట్టి సినిమాలు చేస్తోంది. తెలుగు ఇండస్ట్రీలోకి సీతారామం సినిమాతో అడుగు పెట్టింది. తన అందం, నటనతో అందరినీ ఆకట్టుకుంది. తర్వాత వచ్చిన హాయ్ నాన్న, ఫ్యామిలీస్టార్ సినిమాలతో అచ్చ తెలుగమ్మాయిలా మారిపోవడమేకాదు.. అభిమానుల మనసును దోచుకుంది. వరుసగా ఆఫర్లు అందుకుంటున్న తరుణంలో తల్లిదండ్రుల వల్లే సినిమాల్లో అవకాశాలు తగ్గాయని ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది.

పరిశ్రమలోకి హీరోయిన్ గా వెళతాను అన్నప్పుడు మా నాన్న గారు నో చెప్పలేదు.. ఎటువంటి అభ్యంతరం తెలియజేయలేదు. కాకపోతే ఒక కండిషన్ పెట్టారు. పరిశ్రమలోకి వెళ్లిన తర్వాత ఎక్కడా తమ పరువు తీసే పనిచేయకూడదన్నారు. లిప్ లాక్ సీన్స్, బోల్డ్ సీన్స్ లో అసలు నటించవద్దు అని కండిషన్ పెట్టారు. తెరపై తాను అలా నటిస్తే చూడలేమని, తమ మనసు విరిగిపోతుందని, దయచేసి అటువంటి పనులు మాత్రం చేయవద్దన్నారు. అలా అయితేనే హీరోయిన్ గా వెళ్లు.. లేదంటే లేదు అన్నారంటూ మృణాల్ చెప్పుకొచ్చింది.

mrunal thakur comments on movie offers

అయితే సినిమాల్లో పాత్రలు చేస్తున్న తర్వాత ముద్దు సన్నివేశాలు కూడా వృత్తిలో ఓ భాగమేనని అర్థమైందన్నారు. ఒకవేళ మీకు అసౌకర్యంగా ఉందంటే ఆఫర్లు వదులుకుంటానని తన తల్లిదండ్రులతో చెప్పినట్లు ఈ ముద్దుగుమ్మ వెల్లడించింది. అది తన ఎంపిక కాదని, పాత్రలో ప్రాధాన్యం ఉన్నప్పుడే చేయాలని, అందుకు మీరు అంగీకరించాలని తల్లిదండ్రులను కోరినట్లు మృణాల్ ఠాకూర్ తెలిపింది.

హాయ్ నాన్నలో కనిపించిన తర్వాత ఫ్యామిలీస్టార్ చేసింది. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రాబోతున్న చిత్రంలో కూడా మృణాల్ హీరోయిన్ గా ఎంపికైంది. అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఫ్యామిలీస్టార్ సినిమా ఫ్లాపవడం అమ్మడును కాస్త నిరాశపరిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+