మీరు సిద్ధంగా ఉన్నారా?- మృణాల్ థాకూర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
Mrunal Thakur: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల రణరంగానికి సిద్ధమైంది. ఇదివరకు నిర్వహించిన సిద్ధం బహిరంగ సభలకు కొనసాగింపుగా జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు వైఎస్ఆర్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టారు.
175 నియోజవర్గాల్లో పర్యటించేలా రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసుకున్నారు. దీనికి మేమంతా సిద్ధం అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. కిందటి నెల 27వ తేదీన కడప జిల్లాలోని ఇడుపులపాయలో ఆరంభమైన ఈ బస్సు యాత్ర నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల మీదుగా సత్యసాయి పుట్టపర్తిలో అడుగు పెట్టింది.

ఈ బస్సు యాత్రం నేటికి ఆరో రోజుకు చేరుకుంది. ప్రస్తుతం శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లాలోని కదిరి అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగుతోంది. సోమవారం ఆయన కదిరిలో పర్యటించారు. రోడ్ షోలో పాల్గొన్నారు. వేలాదిమంది ఇందులో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కదిరి మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ భాషా.. జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు.
కదిరి నియోజకవర్గంలోని చీకటిమనిపల్లెలో రాత్రి బస చేశారు జగన్. ఈ ఉదయం అక్కడి నుంచే బస్సు యాత్ర ప్రారంభమైంది. వేపూరికోట, బుర్రకాయలకోట క్రాస్, గొల్లపల్లి మీదుగా అన్నమయ్య రాయచోటి జిల్లాలో ప్రవేశిస్తుంది. అంగళ్లు మీదుగా మదనపల్లికి చేరుకుంటుంది. అక్కడే బహిరంగ సభలో ప్రసంగిస్తారు జగన్. అనంతరం నిమ్మనపల్లి క్రాస్, బోయకొండ క్రాస్, చౌడేపల్లి, సోమల మీదుగా అమ్మగారిపల్లికి చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు.

మేమంతా సిద్ధం యాత్ర ముమ్మరంగా సాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో టాలీవుడ్ నటి మృణాల్ థాకూర్.. ఓ ఆసక్తికరమైన కామెంట్స్‌ను తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. మీరు సిద్ధంగా ఉన్నారా? అంటూ పోస్ట్ పెట్టారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆమె నటించిన తాజా మూవీ.. ఫ్యామిలీ స్టార్. విజయ్ దేవరకొండ హీరో. పరశురామ్ దర్శకుడు. గోపీ సుందర్ సంగీతాన్ని అందించారు. ఈ నెల 5వ తేదీన విడుదల కానుంది. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. హాయ్ నాన్న తరువాత ఆమె నటిస్తోన్నా లేటెస్ట్ మూవీ ఇదే.
ఈ సినిమా విడుదలను దృష్టిలో పెట్టుకుని మృణాల్ ఠాకూర్.. మీరు సిద్ధంగా ఉన్నారా? అంటూ పోస్ట్ పెట్టారు. ఈ సినిమాను అందరూ చూడాలనే ఉద్దేశంతో ఆమె కామెంట్స్ పెట్టారు. టాలీవుడ్‌ను సైతం వైఎస్ఆర్సీపీ కాన్సెప్ట్ నచ్చిందంటూ అభిమానులు వ్యాఖ్యానిస్తోన్నారు. దీన్ని వైరల్ చేశారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications