ఆ విషయంలో అస్సలు సిగ్గుపడను: మృణాల్ ఠాకూర్
Mrunal Thakur: తెలుగు సినీ పరిశ్రమలో 'సీతారామం' సినిమాతో అభిమానుల మనస్సులను గెలుచుకున్న నటి మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. అయితే ఈ స్థాయికి చేరుకోవడం తనకు అంత సులభం కాలేదని మృణాల్ తాజాగా వెల్లడించారు. తన కొత్త సినిమా 'దో దీవానే షెహర్ మే' విడుదర సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మృణాల్ ఠాకూర్ తన కెరీర్ ఆరంభంలో పడ్డ కష్టాలను పంచుకున్నారు.
తొలిసారి అడిగింది ఆ డైరెక్టర్‌నే!
సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అవకాశాలు నేరుగా తన దగ్గరకు రాలేదని.. తానే వాటిని వెతుక్కుంటూ వెళ్లానని మృణాలు ఠాకూర్ తెలిపారు. "నేను పని కోసం మొదట కలిసిన డైరెక్టర్ ఆదిత్య ధర్ (ఉరి, ధురంధర్ ఫేమ్). అప్పట్లో నాకు ఎలా మాట్లాడాలో, పని ఎలా అడగాలో కూడా తెలియదు. కానీ ధైర్యం చేసి వెళ్లి అడిగేదాన్ని. గతేడాది ఆయన 'ధురంధర్' సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్నప్పుడు ఆయనతో మాట్లాడాను. ఆ పాత రోజులను మనం ఎప్పటికీ మర్చిపోలేమని గుర్తు చేసుకున్నాను" అని మృణాల్ ఠాకూర్ అన్నారు.

డైరెక్టర్ల వెంట పడటానికి సిగ్గుపడను..
ఛాన్సుల కోసం డైరెక్టర్ల ముందుకు వెళ్లి 'సర్.. నేను ఇక్కడే ఉన్నాను, ఏదైనా రోల్ ఉంటే చూడండి' అని అడగడానికి తాను అస్సలు సిగ్గుపడనని మృణాల్ స్పష్టం చేశారు. "మనం ఏదైనా పాత్ర కోసం ఎంత ఆకలితో ఉన్నామో తెలిస్తే, డైరెక్టర్లకు కూడా మనపై నమ్మకం ఏర్పడుతుంది. నాకు నచ్చిన టాలెంట్ కనిపిస్తే.. వాళ్ల నంబర్లు సంపాదించి మరీ మెసేజ్ చేస్తాను. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా సంప్రదిస్తాను. ఆ ధైర్యం ఉండబట్టే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను" అని మృణాల్ ధీమాగా చెప్పారు.
సంజయ్ లీలా భన్సాలీతో పనిచేయాలనే కోరిక..
త్వరలో విడుదల కానున్న 'దో దీవానే షెహర్ మే' చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ.. "నేను ఆయనకు నా వర్క్ గురించి ఒక పిచ్ కూడా ఇచ్చాను. మనం నెక్స్ట్ సినిమా ఎప్పుడు చేస్తున్నాం సార్? అని నేరుగా అడిశాను. రవి సార్‌తో సినిమా చేసే అవకాశం కూడా ఇలాగే దక్కింది" అని మృణాల్ ఠాకూర్ వెల్లడించారు.
వరుస సినిమాలతో బిజీ..
మృణాల్ ఠాకూర్, సిద్ధాంత్ చతుర్వేది జంటగా నటించిన 'దో దీవానే షెహర్ మే' ఫిబ్రవరి 20, 2026న థియేటర్లలో విడుదల కానుంది. ఇది ఒక పట్టణ నేపథ్యంలోని అందమైన ప్రేమకథ. మరోవైపు దర్శకుడు ఆదిత్య ధర్ తన తదుపరి చిత్రం 'ధురంధర్: ది రివెంజ్'ను మార్చి 19న విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు.












Click it and Unblock the Notifications