ముఖేష్ అంబానీ ఇంట్లో చెఫ్ వేతనం ఎంతో తెలుసా?
రిలయన్స్ గ్రూప్ గురించి, ఆ కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ గురించి ప్రపంచవ్యాప్తంగా పరిచయం అవసరంలేదు. ప్రపంచంలోనే టాప్-10 ధనవంతుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. ఈ స్థానాల జాబితా అప్పుడప్పుడు మారుతున్నప్పటికీ ఆయన ఆస్తి మాత్రం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. తన తండ్రి ధీరూభాయ్ అంబానీ వారసత్వాన్ని కొనసాగిస్తూ లక్షల సంఖ్యలో ఉద్యోగాలను కల్పించారు. జియో కంపెనీని స్టార్టప్ గా స్థాపించి అగ్రగామి కంపెనీగా అతి తక్కువ సమయంలోనే తీర్చిదిద్దారు. తన రెండో కొడుకు ఆకాష్ అంబానీ వివాహాన్ని ఇటీవలే ఎంతో భారీతనంతో వేలకోట్ల రూపాయలు ఖర్చుచేసి నిర్వహించారు.
అడుగు తీసి అడుగు వేసినా వార్తే
ముఖేష్ అంబానీ ఏం చేసినా వార్తే అవుతుంది. అడుగు తీసి అడుగు వేసినా అందుకు ఎంత ఖర్చవుతుందనే వార్తలే ప్రతిరోజు వస్తుంటాయి. తాజాగా ఆయన ఇంట్లో పనిచేసేవారికి ఎంత జీతం ఇస్తారు? అందుకు అర్హతలేమిటి? వారి జీవన విధానం ఎలా ఉంటుంది? తదితర విషయాల్లో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతుంటాయి. తాజాగా ముఖేష్ ఇంట్లో పనిచేసే కారు డ్రైవర్ తోపాటు వంట వండే చెఫ్ జీతం గురించి తెలిసి అందరూ నోరెళ్లబెడుతున్నారు. కార్పొరేట్ కంపెనీలో పనిచేసే ఉద్యోగికి ఎటువంటి సౌకర్యాలు ఉంటాయో, తన ఇంట్లో పనిచేసేవారికి కూడా అవే సౌకర్యాలను ముఖేష్ కల్పిస్తారు.

ఎంతో గౌరవం ఇస్తారు
ఇంట్లో పనివాళ్లు అని మనం తేలికగా మాట్లాడుకుంటాంకానీ వారు అలా కాదు. ఎంతో గౌరవం ఇస్తారు.. సాదరంగా ఆహ్వానిస్తారు. అంబానీ ఇంట్లో వంట చేయాలంటే డిగ్రీ లేదంటే డిప్లమో ఉండాలి. ఆయన ఇంట్లో పనివారి జాబితా 500 వరకు ఉంది. వంట చేసేవారి వేతనం నెలకు రూ.2 లక్షలుగా ఉంది. డ్రైవర్ వేతనం కూడా అదేస్థాయిలో ఉంది. అంబానీ ఇంట్లో ఉద్యోగం చేయాలంటే అందుకు పరీక్షలు నిర్వహిస్తారు.
ఏ తరహా పనిచేయాలన్నా అన్ని పనులకు సంబంధించి కచ్చితంగా పరీక్షలు నిర్వహిస్తారు. ఇటీవలే జరిగిన ఆకాష్ అంబానీ - రాధికా మర్చంట్ వివాహానికి దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే సెలబ్రిటీలుగా ఉన్నవారంతా హాజరయ్యారు. మన తెలుగు నుంచి చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్; మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటివారంతా హాజరయ్యారు.












Click it and Unblock the Notifications