నా మనసు విరిగిపోయింది.. దేనికి భయపడను - మంచు మనోజ్

మంచు వారి కుటుంబ పంచాయతీ మరోసారి తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇన్నాళ్లు మంచు మనోజ్, మంచు విష్ణు సైలెంట్ గా ఉండడంతో.. అంతా సర్దుమనిగింది అని భావించారు. కానీ ఇప్పుడు మళ్లీ మంచు మనోజ్, విష్ణుపై ఫిర్యాదు చేయడం.. మోహన్ బాబు జల్‌పల్లి నివాసం వద్ద నిరసన చేయడంతో భగ్గుమంది. ఈ క్రమంలోనే మంచు విష్ణుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు మంచో మనోజ్. త‌మ‌ది ఆస్తి గొడ‌వ కాద‌ని.. త‌న‌కు ఈ ఆస్తి వ‌ద్ద‌ని ఎప్పుడో తండ్రికి చెప్పాన‌ని అన్నారు. త‌న జుట్టు విష్ణు చేతుల్లో పెట్టేందుకు ఇలా చేస్తున్నార‌ని ఆరోపించారు. ఇంట్లో త‌న పెంపుడు జంతువులు, వ‌స్తువులు ఉన్నాయ‌ని, వాటి కోస‌మే ఇక్క‌డికి వ‌చ్చాన‌ని తెలిపారు.

ఇక లేటెస్ట్ గా ఓ యూట్యూబ్ ఛాన‌ల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హమ కుటుంబంలో జరుగుతున్న వివాదం గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ఆస్తి గొడవ కాద‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. ఇల్లు, ఇత‌ర ఆస్తుల‌పై త‌న‌కు ఏమాత్రం ఇష్టం లేద‌న్నారు మనోజ్. వాళ్లు చేసిన కొన్ని ప‌నుల వ‌ల్ల త‌న మ‌న‌సు విరిగిపోయింద‌ని అన్నారు. త‌న‌పై ప‌గ, ప్ర‌తీకారాలు తీర్చుకోవ‌డానికే ఈ దాడుల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆయ‌న వాపోయారు.

my-heart-is-broken-i-am-not-afraid-of-anything-manchu-manoj

విద్యార్థుల భ‌విష్య‌త్తు కోసం ప్ర‌శ్నించిన సంద‌ర్భంలో గొడ‌వ‌లు మొద‌ల‌య్యాయని చెప్పారు. సుమారు రెండేళ్ల నుంచి గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయని.. వారిని ప్ర‌శ్నించాన‌నే కార‌ణంతో తన గౌర‌వానికి భంగం క‌లిగించే త‌ప్పుడు క‌థనాలు ప్ర‌చారం చేశారని వాపోయారు. అంతే కాకుండా తనపై దాదాపు 30కి పైగా త‌ప్పుడు కేసులు పెట్టారన్నారు. ఇక ఈ గొడ‌వ‌ల్లోకి నా భార్య‌ను లాగారని.. అలా చేయ‌క‌పోయి ఉంటే నేను ఇంత దూరం వ‌చ్చే వాడిని కాదని మనోజ్ వెల్లడించారు. త‌న భార్య వ‌ల్లే చెడిపోతున్నానంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారని.. ఎఫ్ఐఆర్‌లో తన భార్యాబిడ్డ‌ల పేర్లు చేర్చ‌డంతో మ‌న‌సు విరిగిపోయిందని వాపోయారు. తాను ఏ త‌ప్పు చేయ‌లేదని.. అందుకే దేనికీ భ‌య‌ప‌డ‌నని వివరించారు.

మంగళవారం నాడు మనోజ్ హైదరాబాద్‌ నార్సింగి పోలీసులను ఆశ్రయించాడు. ఏకంగా 150 మంది తన ఇంట్లో చొరబడ్డారని.. తన కార్లతో పాటు వ్యక్తిగత వస్తువులు కూడా ఎత్తుకుపోయారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అందుకు కారణం తన సోదరుడు మంచు విష్ణు అంటూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. తన కూతురు బర్త్‌ డే వేడుకల కోసం రాజస్థాన్‌కు వెళ్లగా.. విష్ణు ఇంట్లోకి ప్రవేశించి రచ్చ చేశారని మంచు మనోజ్‌ పోలీసుల ముందు వాపోయారు. తమ ఇంట్లో జరుగుతున్న పరిణామాలపై తండ్రి మోహన్‌బాబుతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నా అందుబాటులోకి రావడం లేదన్నారు.

ఇక గతేడాది నుంచి మంచు మోహన్‌బాబు కుటుంబంలో విభేదాలు బయటపడ్డాయి. ఆస్తుల వివాదం పీక్‌ స్టేజ్‌కు చేరడంతో మోహన్‌బాబు, విష్ణుపై మంచు మనోజ్‌ పలుమార్లు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. మోహన్ బాబు సైతం మంచు మనోజ్ పై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు మనోజ్‌ ఆరోపణలపై విష్ణు ఎలా స్పందిస్తారో అని హాట్ డిస్కషన్ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+