మిస్ చేసుకున్నా ఆమెతో నా ప్రయాణం ఎప్పటికి చెరిగిపోదు.. నాగ చైతన్య షాకింగ్ కామెంట్స్
అక్కినేని నట వారసుడుగా ఎంట్రీ ఇచ్చాడు నాగచైతన్య. తాత, తండ్రి వారసత్వాన్ని నాగచైతన్య కొనసాగిస్తారని అభిమానులంతా భావించారు. అయితే నాగచైతన్య హీరోగా నిలబడటానికి నానా తంటాలు పడుతున్నాడు. నాగచైతన్య ఇప్పటి వరకు చాలా సినిమాల్లో నటించాడు . కానీ హిట్ కొట్టింది మాత్రం చాలా చాలా తక్కువే అని చెప్పాలి. చైతన్య కెరీర్‌లో ఇప్పటి వరకు బ్లాక్ బ్లాస్టర్ హిట్ ఒక్కటి కూడా లేదు.
హిట్ కొట్టిన సినిమాల్లో కూడా స్టోరీ పరంగాను హీరోయిన్ పరంగాను హిట్ అయినవే ఎక్కువ అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. నాగచైతన్య వ్యక్తిగత జీవితం కూడా అంత గొప్పగా ఏం లేదు. హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య..కొద్దిరోజులకే ఆమెకు విడాకులిచ్చాడు. సమంతతో విడాకులు తర్వాత నాగ చైతన్య శోభితా ధూళిపాళ్లతో రిలేషన్‌లో ఉన్నారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

దీనికి తగ్గట్టుగానే వీరిద్దరు కలిసి దర్శనం ఇవ్వడంతో ఇదింతా కూడా నిజమే అని అంతా భావించారు. దీంతో శోభితతో నాగ చైతన్య డేటింగ్ చేస్తున్నాడని అందరు భావిస్తున్నారు. శోభితతో నాగచైతన్య కలిసి యూరప్ ట్రిప్‌కు వెళ్లాడు. ఓ వైన్ టెస్ట్ పార్టీ జరుగుతుండగా అక్కడికి వీరిద్దరూ కలిసి వెళ్లినట్లు తెలుస్తోంది.శోభిత పక్కనే నాగ చైతన్య దర్శనం ఇవ్వడంతో అందరు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇదిలా ఉంటే నాగ చైతన్య తాజాగా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ చైతన్య తన పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. చెన్నైలో పుట్టి పెరిగిన నాగ చైతన్య డిగ్రీ చదివే సమయానికి హైదరాబాద్‌కి వచ్చేశారు. డిగ్రీ చదువుతున్న సమయంలో సమ్మర్ వెకేషన్‌కి ముంబై వెళ్లి ఎంజాయ్ చేసేవాడినని ఆయన చెప్పుకొచ్చారు.. ఇక చిన్నప్పుడు తన తల్లితో ట్రైన్‌లో ముంబైకి వెళ్లి.. మరోసారి తల్లితో పాటు హైదరాబాద్‌కు ట్రైన్ జర్నీ చేశారట.
ఈ రెండుసార్ల ప్రయాణం నాకు ఎప్పటికే స్పెషల్‌గానే ఉంటుందని, అది నా మది నుంచి ఎప్పటికి చెరిగిపోదని నాగ చైతన్య ఈ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ప్రపంచంలో ఎన్ని ప్రాంతాల్లో తిరిగినా, ఎన్ని మిస్ చేసుకున్నా, చివరకి నా రిటైర్‌మెంట్ సమాయానికి గోవాలోనే సెటిల్ అవుతా అని చైతు తెలిపాడు. 45 ఏళ్లు వచ్చాక పూర్తిగా గోవాకి షిఫ్ట్ అయిపోయి.. ఏడాదొక సినిమా తీసుకుంటూ అక్కడే పూర్తిగా ఉండిపోవాలి అనుకుంటున్నానని చైతన్య చెప్పుకొచ్చాడు.












Click it and Unblock the Notifications