నాగ చైతన్య కొంపముంచింది ఆ సినిమానే
హీరో నాగ చైతన్య వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో తాండేల్ సినిమాలో నటిస్తున్న చైతన్య..ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. విరూపాక్ష సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ట్ డైరెక్టర్‌గా మారిపోయిన కార్తీక్ దండు దర్శకత్వంలో ఒక సినిమాకి చేయడానికి నాగ చైతన్య రెడీ అయ్యాడు. విరూపాక్ష మాదిరిగానే ఈ సినిమా కూడా హారర్ జోనర్‌లో తెరకెక్కబోతుంది.
ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టుగా సమాచారం అందుతోంది. ఇదిలా ఉంటే నాగ చైతన్య కెరీర్ అనుకున్నంత సక్సెస్ కాలేదనే చెప్పాలి. స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన మహేష్ , ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి వారు సూపర్ స్టార్లుగా ఎదిగారు. అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన నాగ చైతన్య మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. నాగచైతన్య హీరోగా నిలబడటానికి నానా తంటాలు పడుతున్నాడు.

నాగచైతన్య ఇప్పటి వరకు చాలా సినిమాల్లో నటించాడు . కానీ హిట్ కొట్టింది మాత్రం చాలా చాలా తక్కువే అని చెప్పాలి. చైతన్య కెరీర్‌లో ఇప్పటి వరకు బ్లాక్ బ్లాస్టర్ హిట్ ఒక్కటి కూడా లేదు. హిట్ కొట్టిన సినిమాల్లో కూడా స్టోరీ పరంగాను హీరోయిన్ పరంగాను హిట్ అయినవే ఎక్కువ అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. కారణాలు తెలియదు కానీ నాగ చైతన్య కెరీర్ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది.
అయితే నాగ చైతన్య సూపర్ హిట్లను వదులుకోవడంతో ఆయనకు ఈ దుస్థితిలో ఉన్నారని..ఆ సినిమాలు చేసి ఉంటే నాగ చైతన్య కెరీర్ మరో రేంజ్‌లో ఉండేదని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. రామ్ హీరోగా వచ్చిన నేను శైలజ మొదట నాగ చైతన్యకు వినిపించాడ దర్శకుడు తిరుమల. అయితే కథ స్లోగా ఉందనే కారణంతో ఆ సినిమాను రిజెక్ట్ చేశాడట చైతు.
దీంతో పాటు నితిన్ హీరోగా వచ్చిన ఇష్క్ సినిమా ఈ రెండు సినిమాల్ని మొదట ఆయా డైరెక్టర్లు నాగచైతన్య తో చేయాలని ప్లాన్ చేశారు.కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమాలు చేయలేకపోయాడు.ఈ రెండు సినిమాలు చేసి ఉంటే నాగ చైతన్య కెరీర్ మరోలా ఉండేదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. తాండేల్‌తో పాటు, కార్తీక్ దండు దర్శకత్వంలో చేయబోయే సినిమాలు హిట్ అయితే నాగ చైతన్య కెరీర్ దూసుకుపోవడం ఖాయమని అక్కినేని అభిమానులు ఆశపడుతున్నారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications