"శోభిత - సమంత"తో నాగ చైతన్య ఫోటో వైరల్..!
అక్కినేని వారసుడు, యువ సామ్రాట్ నాగ చైతన్య.. గత కొన్నేళ్లుగా వరుస సినిమాలతో ప్రేక్షకులను నిరాశపరిచిన చైతూ ఈసారి 'తండేల్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం కార్తీక్ వర్మ దర్శకత్వంలో "వృషకర్మ" అనే సినిమా చేస్తున్నారు. మిథికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ మూవీలో డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. చైతూ ఆ మూవీ షూటింగులో బిజీ బిజీగా గడిపేస్తూ.. మరో సినిమాని పట్టాలెక్కించే పనిలో ఉన్నట్టు ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది.
అయితే ఇప్పుడు "శోభిత - సమంత"తో కలిసి ఫోటో దిగారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. నమ్మశక్యం కాకపోయినా కూడా ఇది నిజం. టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్స్ అంటే ఆరోజుల్లో సమంత, నాగచైతన్యనే గుర్తొచ్చేవారు. నాగ చైతన్య సరసన 'ఏ మాయ చేసావే' సినిమాలో నటించి సమంత ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాతోనే ఈ ఇద్దరి మధ్య స్నేహం చిగురించి, చివరకు అది ప్రేమగా మారింది. దీంతో వీరు ఇద్దరూ పెద్దవారిని ఒప్పించి 2017లో ఘనంగా వివాహం చేసుకున్నారు. కానీ వివాహమైన కొన్నేళ్లకు మనస్పర్థల కారణంగా విడిపోయి అందరికీ షాక్ ఇచ్చారు.

కాగా ఆ తర్వాత 2024 డిసెంబర్ 4న నటి శోభితా ధూళిపాళ్లను.. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు చైతన్య. ఇటీవలే ఈ జంట తమ మొదటి వివాహ వార్షికోత్సవాన్ని కూడా సెలబ్రేట్ చేసుకుంది. వీరిద్దరూ త్వరలోనే తమ మొదటి బిడ్డకు ఆహ్వానం పలకనున్నారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో సైతం నాగార్జునకు ఈ ప్రశ్న ఎదురవగా.. రూమర్స్ పై ఇన్ డైరెక్ట్ గానే రియాక్ట్ అవ్వడంతో ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది.
ఇక ఇప్పుడు అక్కినేని నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ల, ఆమె సోదరి కలిసి ఉన్న ఓ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కానీ శోభిత సోదరి పేరు 'సమంత' కావడంతో ఈ వ్యవహారం సినీ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారింది. నెటిజన్లు కూడా ఈ పోస్టుపై తమదైన శైలిలో స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

చైతన్య భార్య సోదరి పేరు.. మాజీ భార్య పేరు ఒకటే కావడంపై పలువురు కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 'సమంత' పేరుకు నాగ చైతన్యకు తెలియని బాండింగ్ ఉందంటూ పోస్టును తెగ షేర్ చేస్తున్నారు. మరోవైపు సమంత ఇటీవలే బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్నారు. 2025 డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లో ఘనంగా పెళ్లి వేడుక జరిగింది.
-
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications