తండేల్ ట్విట్టర్ రివ్యూ.. అదొక్కటే మైనస్
అక్కినేని నట వారసుడుగా ఎంట్రీ ఇచ్చాడు నాగచైతన్య. తాత, తండ్రి వారసత్వాన్ని నాగచైతన్య కొనసాగిస్తారని అభిమానులంతా భావించారు. అయితే నాగచైతన్య హీరోగా నిలబడటానికి నానా తంటాలు పడుతున్నాడు. నాగచైతన్య ఇప్పటి వరకు చాలా సినిమాల్లో నటించాడు . కానీ హిట్ కొట్టింది మాత్రం చాలా తక్కువే అని చెప్పాలి. చైతన్య కెరీర్‌లో ఇప్పటి వరకు బ్లాక్ బ్లాస్టర్ హిట్ ఒక్కటి కూడా లేదు.
సరైన హిట్ కోసం చాలాకాలం వేచి చూస్తోన్న నాగ చైతన్య , తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మూడేళ్లు ఈ సినిమా కోసం కష్టపడ్డ నాగ చైతన్య, తండేల్‌పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

తండేల్ మూవీ చూసిన ఆడియన్స్ ఈ సినిమాపై పాజిటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు.ఫర్మామెన్స్ పరంగా చూస్తే నాగ చైతన్య కెరీర్‌లోనే ఈ సినిమా బెస్ట్‌గా నిలుస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సాయి పల్లవి మరోసారి తనదైన మ్యాజిక్ చేసిందని, సినిమాకు ఆమె హైలెట్ అనే మాటలు వినిపిస్తున్నాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం రొమాంటిక్ లవ్ డ్రామాతో నడిపించిన దర్శకుడు, సెంకడాఫ్‌ను మాత్రం ఇండియా-పాకిస్తాన్ రైవల్రీ, హీరో అరెస్ట్ వంటి సీన్లతో నింపేశాడని ప్రేక్షకులు చెబుతున్నారు.
ఈ తండేల్ మూవీకి దేవిశ్రీ సాంగ్స్ బ్యాక్ బోన్‌గా నిలిచారని..ఈ మధ్య కాలంలో దేవిశ్రీ ఇచ్చిన బెస్ట్ ఆల్బమ్ అన్నమాట వినిపిస్తుంది.అయితే మొదటి భాగాన్ని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు, సెంకడాఫ్‌కు వచ్చే సరికి కథను సరిగా ముందుకు తీసుకువెళ్లలేకపోయాడనే మాటలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా పాకిస్తాన్ ఎపిసోడ్స్ అసహజంగా ఉంటాయి.ఆకట్టుకోవనే భావనను ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు.చివరి 20 నిమిషాలు వచ్చే సీన్లు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయట.మొత్తంగా తండేల్ మూవీ బాగుందని, భారీ అంచనాలు మాత్రం పెట్టుకుని సినిమాను చూడవద్దంటూ ప్రేక్షకులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications