సమంతను మోసం చేశా..నాగ చైతన్య షాకింగ్ కామెంట్స్
హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంతల బంధం గురించి అందరికి తెలిసిన విషయమే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. కొన్ని సంవత్సరాలకే విడాకులు తీసుకోవడం జరిగింది. తెలుగు ఇండస్ట్రీలో సమంత -నాగచైతన్య జంట బెస్ట్ పెయిర్‌గా నిలుస్తుందని అందరు భావించారు. కాని వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు. అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి.. సమంతది తప్పంటే.. లేదు నాగచైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్దం చేశారు.
విడాకులపై నాగచైతన్య ఎప్పుడు మాట్లాడింది లేదు. కాని సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరొక్షంగా విడాకులపై స్పందిస్తూ వస్తున్నారు. అయితే వారిద్దరు తిరిగి కలిస్తే చాలా బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా నాగ చైతన్యకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శైలజా రెడ్డి అల్లుడు మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ అను ఇమాన్యుల్‌తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు నాగ చైతన్య.

మీరు ఎప్పుడైనా రిలేషన్‌షిప్‌లో మోసం చేశారా అని యాంకర్ ప్రశ్నించగా..దీనికి హీరోయిన్ అను ఇమాన్యుల్ నేను ఎప్పుడు మోసం చేయలేదంటూ సమాధానం ఇచ్చింది. నాగ చైతన్య మాత్రం తాను రిలేషన్‌షిప్ ఉన్నప్పుడు మోసం చేశానని సమాధానం ఇస్తాడు. నాగ చైతన్య అక్కడితో ఆగకుండా ప్రతి ఒక్కరూ జీవితంలో అన్ని అనుభవించాలి.
అప్పుడే ఎదుగుతారు అని చెప్పుకొచ్చాడు. దీంతో నాగ చైతన్య సమంతను మోసం చేశాడనే విషయాన్ని అంగీకరించడాని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే నాగ చైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ డేటింగ్ చేస్తున్నారనే రూమర్స్ తెర మీదకు వస్తున్నాయి. అయితే తాము కేవలం స్నేహితులమే అంటూ పుకార్లను ఈ జంట కొట్టిపారేస్తున్నారు.
-
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..












Click it and Unblock the Notifications