జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్... నాగబాబు సంచలన వ్యాఖ్యలు

చిరంజీవి సోదరుడు, ప్రముఖ నటుడు నాగబాబు తరుచుగా సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. ఆ విషయంలో ఆయనకు ఎటువంటి మొహమాటాలు ఉండవు. తన మనసులో ఏముందో అదే చెప్పేస్తుంటారు. పైకి ఒకటి, లోన మరొకటి మాట్లాడే తరహా వ్యక్తి కాదు నాగబాబు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా అల్లు అర్జున్ పై పరోక్షంగా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మనవాడు పరాయివారితో ఉంటే మనవాడైనా వాడు పరాయివాడేనని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు బన్నీ గురించే అని రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరిగింది.

రవితేజ జీవితం స్ఫూర్తిదాయకం
గతంలో ఓ సందర్భంలో నాగబాబు రవితేజ గురించి మాట్లాడారు. ప్రస్తుతం తెలుగులో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరోలు అంటే ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ పోతినేని పేర్లు చెబుతారని, కానీ వారందరికన్నా రవితేజ ఎనర్జిటిక్ హీరో అని ప్రశంసించారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూ తర్వాత గుర్తింపు లేని పాత్రలు చేస్తూ ఈరోజు స్టార్ హీరో అయ్యారని కొనియాడారు. కొందరు తాను ఎందుకూ పనికిరాను.. తన జీవితం ఇంతే అని బాధపడుతుంటారని, అటువంటివారందరికీ రవితేజ జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమని, ఆయన జీవితం గురించి, ఆయన్ను గురించి తెలుసుకొని స్ఫూర్తి పొందాలని సూచించారు.

Nagababu comments on Ravi Teja citing NTR and Allu Arjun

ఆ సత్తా రవితేజకు ఉంది
ఎనర్జిటిక్ డైలాగులు చెప్పాలన్నా, డ్యాన్సులు చేయాలన్నా, పోరాటాలు చేయాలన్నా ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ తో పోటీపడే సత్తా రవితేజకు ఉందన్నారు. రవితేజతో కలిసి నాగబాబు మిరపకాయ సినిమాలో నటించారు. ఆ సినిమా హిట్ అయింది. అందులో పోలీసు అధికారి పాత్ర పోషించారు నాగబాబు. జూనియర్ ఎన్టీఆర్ కు తండ్రిగా అరవింద సమేత సినిమాలో కనిపించారు. అడపా దడపా సినిమాలు చేస్తున్న నాగబాబు ప్రస్తుతం జనసేన పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. రాజ్యసభకు పంపించే యోచనలో జనసేనాని పవన్ కల్యాణ్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా కూడా ఆయన పేరు వినిపించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+