అక్కినేని ఫ్యాన్స్ కు లైఫ్ టైమ్ సెటిల్ మెంట్..! రాజమౌళి డైరెక్షన్ లో..
కొన్ని కాంబినేషన్ లు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అవి కుదిరితే బాక్సాఫీస్ బద్దలే.. ఇటీవల బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవి కాంబోలో వచ్చిన మన శంకరవర ప్రసాద్ గారు మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నేపథ్యంలో డైరెక్టర్ అనిల్ రావిపూడికి అక్కినేని ఫ్యాన్స్ నుంచి అనేక రిక్వెస్ట్ లు సామాజిక మాధ్యమాల ద్వారా వెళ్లాయి. కింగ్ నాగార్జునతో హలో బ్రదర్ రేంజ్ లో ఓ సినిమా చేయాలని ఫ్యాన్స్ పట్టుబట్టారు. దీనికి అనిల్ కూడా సానుకూలంగా స్పందించారు. తనకూ నాగార్జునతో సినిమా చేయాలని ఉందని చెప్పుకొచ్చారు.
అయితే ఇప్పుడు మరో న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. అదే రాజమౌళి- అక్కినేని నాగ చైతన్య కాంబినేషన్.. అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం తన 24 వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇటీవల తండేల్ లో మంచి హిట్ అందుకున్నారు చైతూ. దాంతో ఇప్పటి నుంచి తన తదుపరి సినిమాలను పకడ్బందీగా ఉండేలా లైనప్ సిద్దం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.అయితే ఏ హీరోకు అయినా 25 సినిమా స్పెషల్. అటు చిన్న హీరో అయినా.. పెద్ద హీరో అయినా 25 వ సినిమా చాలా స్పెషల్ గా ఉండాలని కోరుకుంటారు.
ఈ నేపథ్యంలోనే చైతూ తన 25 వ సినిమా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో ఉండే అవకాశం ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. తాజాగా రాజమౌళి.. చైతూ నివాసానికి కూడా వెళ్లినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రావాల్సి ఉంది. ఇదే నిజమైతే అక్కినేని ఫ్యాన్స్ కు ఇదో లైఫ్ టైమ్ సెటిల్ మెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రాజమౌళితో సినిమా అంటే ఇంటర్నేషన్ రేంజ్ లో ఉంటుంది మరి.. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి వారణాసి మూవీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

ఈ మూవీ రిలీజ్ అయితే జక్కన్న స్థాయి అంతర్జాతీయ రేంజ్ లో పాపులర్ అవుతుంది. మరి ఆ తర్వాత చైతూతో సినిమా అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుంది. దాంతో అక్కినేని ఫ్యామిలీ నుంచి పాన్ ఇండియా హీరోగా చైతూ మారే అవకాశం ఉంది. అందుకే అక్కినేని ఫ్యాన్స్ .. ఈ న్యూస్ నిజం కావాలని కోరుకుంటున్నారు. మరి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే విడుదల కానున్నట్లు సమాచారం. మరోవైపు కొరటాల శివ, శేఖర్ కమ్ముల కూడా నాగచైతన్య 25 సినిమాను డైరెక్ట్ చేసేందుకు లిస్టులో ఉన్నారట.
-
హనీమూన్ లో కొత్త జంట, ప్రైవేట్ రిసార్ట్లో ఆనంద క్షణాలు -
సవాల్ చేసి మరీ అవార్డు కొట్టాడయ్యా..! -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
నందమూరి బాలకృష్ణకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు.. జై బాలయ్య !! -
దివ్యాంగులకు అండగా "పెద్ది" సినిమా నిర్మాత వెంకట సతీష్ కిలారు..! -
ఆ హీరోతో నటించాలని ఉంది.. కానీ అలా మాత్రం కాదు !! -
పెళ్లి కంటే సహజీవనం బెస్ట్: మెగా హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ -
రాజకీయ వారసురాలు.. గ్లామర్ తార.. రామ్చరణ్ బ్యూటీని చుట్టుముట్టిన వివాదం! -
కొత్త బిజినెస్ షురూ చేసిన తెలుగు యాంకర్..! -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !!












Click it and Unblock the Notifications