నాగార్జునను వణికించిన స్టార్ హీరోయిన్..?
హీరో నాగార్జున గురించి ఇండస్ట్రీలో ఎవరినైనా అడిగితే ఆయన నట సామ్రాట్ నాగేశ్వరరావు కుమారుడని, మన్మథుడని, గ్రీకు వీరుడని , అమ్మాయిల కలల రాకుమారడని ఇలా రకరకాలుగా చెబుతుంటారు. అక్కినేని నాగేశ్వరరావు కొడుగ్గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నాగార్జున తనకంటూ ప్రత్యేకంగా అభిమానులను సొంతం చేసుకున్నారు.
వెండితెర మీదే కాదు.. బుల్లితెర మీద కూడా తనకు ఎవరు పోటీ లేరని బిగ్‌బాస్ షోతో మరోసారి నాగార్జున నిరుపించుకున్నారు. హీరోయిన్లందరూ కూడా నాగార్జునతో కలిసి ఒక్క సినిమాలో అయినా నటించాలని కోరుకుంటారు. అలాంటిది ఓ హీరోయిన్ నాగార్జున సినిమాను రిజెక్ట్ చేశానని చెప్పి సంచలనం సృష్టించింది. అయితే నాగార్జున మాత్రం ఓ హీరోయిన్‌తో నటించడానికి తెగ భయపడిపోయారట. ఆ హీరోయిన్ మరెవరో కాదు..అతిలోక సుందరి శ్రీదేవి.

అవును శ్రీదేవితో నటించడానికి నాగార్జున తెగ భయపడిపోయారట. శ్రీదేవితో కలిసి నటించడానికి మొదట్లో నాగార్జున వణికిపోయేవారట. ఎందుకంటే నటనపరంగా నాగార్జున కంటే శ్రీదేవి చాలా సీనియర్. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు వంటి అగ్ర హీరోలతో శ్రీదేవి సినిమాలు చేశారు. అలాంటి స్టార్ హీరోయిన్‌తో నటించడం అంటే మాములు విషయం కాదు.
అటువంటి శ్రీదేవి పక్కన తాను నటించగలనా అని నాగార్జున తెగ భయపడేవారట. శ్రీదేవితో కలిసి యాక్ట్ చేయడం ఆయన ఛాలెంజ్‌గా తీసుకున్నారు .ఆమెతో కలిసి పోటా పోటీగా నటించేవారు. కానీ రోజుల గడుస్తున్న కొద్ది నాగార్జునలో భయం పోయిందట.ఇక ఆఖరి పోరాటం తర్వాత నాగార్జున-శ్రీదేవి కాంబినేషన్ లో రామ్ గోపాల్ వర్మ గోవిందా గోవిందా సినిమాను తీశారు. కానీ ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. బాలీవుడ్‌లో కూడా రెండు సినిమల్లో శ్రీదేవి-నాగార్జున జంటగా నటించారు. అటు తండ్రి, ఇటు కొడుకు.. ఇద్దరితోనూ శ్రీదేవి రొమాన్స్ చేశారు.












Click it and Unblock the Notifications