నాగార్జునకు ఎన్టీఆర్ ద్రోహం చేస్తున్నాడా?

Coolie vs War 2: టాలీవుడ్ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ధనుష్‌తో కలిసి "కుబేర" సినిమాలో నటించిన ఆయన.. త్వరలో విడుదల కానున్న సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా "కూలీ"లో పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. అయితే అదే రోజు జూనియర్ ఎన్టీఆర్ నటించిన బాలీవుడ్ చిత్రం "వార్ 2" కూడా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తుండగా.. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా కూడా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.

ఈ రెండు భారీ సినిమాలు ఒకే రోజు విడుదల కానుండడంతో సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. దీనిపై టాలీవుడ్ అభిమానులు సరదాగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. నాగార్జునను సొంత కొడుకులా చూసుకునే ఎన్టీఆర్, ఇప్పుడు ఆయన సినిమాకు పోటీగా తన సినిమాను విడుదల చేసి ద్రోహం చేస్తున్నాడని సరదాగా అంటున్నారు.

Nagarjuna vs Jr NTR A Friendly Rivalry as Coolie and War 2 Release on Same Day

నిజానికి నాగార్జున, ఎన్టీఆర్ కుటుంబాల మధ్య చాలా బలమైన బంధం ఉంది. నాగార్జున, ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణను తన సోదరుడిలా భావిస్తారు. వారిద్దరూ కలిసి "సీతారామరాజు" సినిమాలో నటించారు. ఆ బంధం నాగార్జున, ఎన్టీఆర్‌ల మధ్య కూడా కొనసాగుతోంది. ఎన్టీఆర్ ప్రేమగా నాగార్జునను "నాగ్ బాబాయ్ " అని పిలుస్తారు. నాగార్జున కూడా ఎన్టీఆర్‌ను సొంత కొడుకులా చూసుకుంటారు.

మరోవైపు 60 ఏళ్లు దాటినా నాగార్జున అందం, ఆకర్షణ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే అభిమానులకు గూస్‌బంప్స్ వస్తాయి. 'బంగార్రాజు', 'నా సామిరంగ'వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన నాగార్జున, ఇప్పుడు మొదటిసారి ఫుల్ లెంగ్త్ విలన్ పాత్రలో కనిపించనుండటం అభిమానులను మరింత ఆకర్షిస్తోంది. కూలీ, వార్ 2 రెండు సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆగస్టు 14న ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలా పోటీ పడతాయో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+