సినిమాల్లో స్టార్ హీరో... అది వదిలిపెట్టి కార్గిల్ యుద్ధంలోకి... రియల్ హీరో

సినిమాల్లో హీరోలు చాలామంది దేశం కోసం పోరాడే సైనికుడి పాత్రలు పోషిస్తారు. అది చూసి ఎంతోమంది ఉత్తేజితులవుతారు. ఆ సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత ఆ హీరో మరో పాత్ర చేస్తాడు. ఇది సహజంగా జరిగే పరిణామం. దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి మనకోసం కాపలాకాస్తుండే సైనికులంటే అందరికీ గౌరవం. రాత్రివేళ మనం హాయిగా నిద్రపోతున్నామన్నా వారి చలవే. ఎంతోమంది వీరసైనికుల జీవితాలు వెండితెరపై ప్రాణం పోసుకున్నాయి. కానీ సినిమాల్లో నటించే ఓ హీరో మాత్రం వాటిని వదిలిపెట్టి ధైర్యంగా కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నారు.

మూడుసార్లు జాతీయ అవార్డు పొందారు
ఆ నటుడు ఎవరో కాదు.. మూడుసార్లు జాతీయ అవార్డు గెలుపొందిన నానాపటేకర్. ప్రహార సినిమా చేసే సమయంలో మూడు సంవత్సరాలు మరాఠా లైట్ ఇన్ఫాంట్రీతో కలిసి శిక్షణ పొందారు. ఆ శిక్షణ ఆయన జీవితాన్ని మార్చింది. కార్గిల్ యుద్ధం 1999లో జరిగింది. ఆ సమయంలో దేశానికి ఏదైనా చేయాలనే తపనతో నానాపటేకర్ ఆర్మీలో సీనియర్ అధికారులను కలిసి ఫ్రంట్ లైన్ కు వెళ్లాలనే తన కోరికను వారిదగ్గర వ్యక్తపరిచారు. రక్షణ మంత్రి అనుమతి లేకుండా అది సాధ్యం కాదని చెప్పడంతో ఆయన పట్టువిడవకుండా అప్పటి రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ కు ఫోన్ చేసి తాను శిక్షణ తీసుకున్న విషయాన్ని ఆయనకు చెప్పారు. దేశభక్తి, దేశంపై నానాపటేకర్ ప్రేమ చూసిన జార్జి వెంటనే అనుమతి మంజూరు చేశారు.

Nana Patekar s special features of participating in the Kargil War

యుద్ధంలో 20 కిలోల బరువు తగ్గారు
కార్గిల్ యుద్ధంలో భాగంగా 1999 ఆగస్టులో రెండువారాలపాటు ఎల్‌వోసీ (సరిహద్దు నియంత్రణ రేఖ) వెంబడి గడిపాడు. యుద్ధంలో గాయపడిన సైనికులను ఆసుపత్రికి తీసుకువెళ్లడం, అవసరమైనప్పుడు సైనికులకు సహాయం చేయడంలాంటి పనులు చేశారు. అక్కడి వాతావరణ పరిస్థితులు కూడా ఎంతో కఠినంగా ఉండేవి. కౌన్ బనేగా కరోడ్ పతి 16వ షోలో పాల్గొన్నప్పుడు నానా ఈ విషయాలన్నీ స్వయంగా తెలిపాడు. యుద్ధంలో పాల్గొనేందుకు వెళ్లిన సమయంలో 76 కిలోల బరువున్నానని, తిరిగి వచ్చేటప్పుడు 56 కిలోల బరువున్నట్లు చెప్పారు. యుద్ధం ముగిసి భారత్ విజయం సాధించిన తర్వాత తిరిగి సినిమాల్లోకి అడుగుపెట్టారు నానా. ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించిన నానాపటేకర్ తన పాత్రల్లో నటించడంకన్నా జీవిస్తారని చెప్పొచ్చు. ఈ విషయం తెలుసుకున్న ఎంతోమంది భారతీయులు పటేకర్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+