నందమూరి బాలకృష్ణ ఆల్ టైం రికార్డ్
నందమూరి నటసింహం బాలకృష్ణ తన కెరీర్ లో ఫుల్ జోష్ లో ఉన్నారు. తాజాగా విడుదలైన భగవంత్ కేసరి సినిమా సూపర్ హిట్ కావడంతోపాటు ఎన్నో రికార్డులను ఆయన తిరిగరాస్తున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి... ఇలా మూడు వరుస సినిమాలతో బాలయ్య మూడుసార్లు వరుసగా రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన హీరోగా రికార్డు సృష్టించాడు.
అలాగే అమెరికాలో వరుసగా మూడుసార్లు వన్ మిలియన్‌కు పైగా డాలర్లు కొల్లగొట్టిన సీనియర్ హీరోగాను సరికొత్త రికార్డు నెలకొల్పారు. సీనియర్ హీరోల్లో ఎవరికీ ఈ తరహా రికార్డు లేదు. వరుసగా మూడు సినిమాలు సూపర్ హిట్ కావడమంటే మాములు విషయం కాదు. ఈ మూడు సినిమాలు బాలయ్య కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచిపోయాయి. కలెక్షన్లు బ్రహ్మాండంగా రాబడతూ బాక్సాఫీస్ బొనాంజా అని తనను ఎందుకు అంటారో నిరూపించారు.

ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరులో అత్యంత అరుదైన రికార్డును బాలయ్య నెలకొల్పారు. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలు వరుసగా అక్కడ రూ. 15 లక్షలకు పైగా షేర్ రాబట్టాయి. దీనికి ముందు బాలకృష్ణ వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి కూడా కందుకూరు సిటీలో రూ.15 లక్షలకు షేర్ ను రాబట్టింది. చిన్న మున్సిపాలిటీ అయిన కందుకూరులో రూ.15 లక్షల పైగా షేర్ ఉన్న నాలుగు సినిమాలు తన ఖాతాలో వేసుకున్న ఏకైక హీరోగా బాలయ్య కందుకూరు చరిత్రలో నిలిచిపోయారు.
వరుసగా మూడు సినిమాలు రూ.15 లక్షలకు పైగా షేర్ రాబట్టడం.. కందుకూరులో మరే హీరోకు ఈ రికార్డు లేకపోవడం అరుదైన విషయంగా ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. కందుకూరులో బాలయ్యకు ఎంత బలమైన ఫ్యాన్ బేస్ ఉందో దీన్నిబట్టి అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications