తెలుగు సినీ ఇండస్ట్రీలో సంచలన రికార్డు దిశగా బాలయ్య
నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన భగవంత్ కేసరి విడుదలైంది.. సినిమా బ్లాక్ బస్టర్ దిశగా దూసుకువెళుతోంది. విడుదలైన అన్నిచోట్లా పాజిటివ్ టాక్ రావడంతో అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా సత్తా చాటుతోంది. వచ్చేది దసరా పర్వదినం కావడం.. ఆరోజు సెలవురోజు కావడంతో భగవంత్ కేసరి ఆరోజు కూడా బాక్సాఫీస్ ను కొల్లగొట్టడం ఖాయమైపోయింది.
అడవిబిడ్డ నేలకొండ భగవంత్ కేసరి బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్లు రాబడుతున్నాడు. ఈ సినిమా 19వ తేదీన విడుదలైంది. బాలయ్యని నెవర్ బిఫోర్ అనే రోల్ లో అనిల్ రావిపూడి చూపించాడు. బ్యాడ్ టచ్ సీన్ లో బాలయ్య చేసిన పెర్ఫార్మెన్స్ ఎన్నిసార్లు చూసినా తక్కువే అవుతుందంటూ పొగడ్తలు వస్తున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ మళ్లీ మళ్లీ థియేటర్లకు వస్తున్నారు. అభిమానులకు ఫ్లాష్ బ్యాక్ లో వచ్చిన పోలీస్ గెటప్ బాగా నచ్చింది. వారు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. భావోద్వేగాలు, యాక్షన్.. రెండూ బ్యాలన్స్ అవ్వడం బాలయ్య కెరీర్ లో చాలా అరుదుగా జరుగుతుంది. భగవంత్ కేసరి సరిగ్గా ఇలాగే చేసింది.

బాలయ్య ఇప్పటివరకు చేసిన సినిమాలన్నింటికన్నా ఇది చాలా ప్రత్యేకమని చెప్పాలంటున్నాయి సినీ వర్గాలు. మౌత్ టాక్ పాజిటివ్ గా ఉండటంతో బుకింగ్స్ కూడా అదరగొడుతోంది. మూడోరోజు కూడా దుమ్ము దులిపిన బాలయ్య వరల్డ్ వైడ్ గా మూడురోజుల్లో 71.2 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. సండే బుకింగ్స్ అదిరిపోయాయి. అలాగే సోమవారం, మంగళవారం రెండురోజులు దసరా పర్వదినం కావడంతో ఐదురోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి ప్రవేశించనుంది. సీనియర్ హీరోల్లో హ్యాట్రిక్ హండ్రెడ్ క్రోర్స్ రాబట్టిన హీరోగా అరుదైన రికార్డును బాలయ్య సొంతం చేసుకోనున్నారు. దీంతో బాలయ్య అభిమానుల ఆనందాలకు అవధుల్లేకుండా పోయింది.












Click it and Unblock the Notifications