ఏడాదిలో 6 బ్లాక్ బస్టర్లు... బాలయ్య రేర్ రికార్డ్

నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమా విడుదలవుతోంది అంటే అభిమానులకు పెద్ద పండగే అని చెప్పొచ్చు. థియేటర్ల దగ్గర హడావిడి అలా చేస్తారు. కటౌట్లకు పాలాభిషేకం, కొబ్బరికాయలు కొట్టడం, ఈలలు, కేకలతో థియేటర్లన్నీ దద్దరిల్లిపోయేవి. ఈనెల 30వ తేదీకి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తిచేసుకుంటున్నారు. సెప్టెంబరు ఒకటోతేదీన హైదరాబాద్ లో బాలయ్య గోల్డెన్ జూబ్లీ వేడుక జరగనుంది. దీనికి అతిరథ మహారథులంతా హాజరవుతున్నారు. ఈ తరుణంలో బాలయ్య తన సినిమాలద్వారా నెలకొల్పిన పలు రికార్డుల గురించి తెలుసుకుందాం. అందులోను 1986లో ఒకే ఏడాదిలో ఆరు బ్లాక్ బస్టర్లు సాధించి అరుదైన రికార్డును నెలకొల్పారు.

ముద్దుల క్రిష్ణయ్య
కోడి రామకృష్ణ దర్శకత్వంలో భార్గవ్ ఆర్ట్స్ నిర్మించి ముద్దుల కృష్ణయ్య సంచలన విజయం సాధించింది. సినిమా మొత్తం గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కింది. విజయశాంతి, రాధ హీరోయిన్లుగా నటించారు. మొదటివారంలో ఈ సినిమా కోటిరూపాయల గ్రాస్ సాధించి సంచలనాన్ని సృష్టించింది.

nandamuri balakrishna create rare record in telugu film industry

సీతారామ కల్యాణం
బాలయ్య తన కెరీర్ లో కాలేజీ కుర్రాడిలా నటించారు. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రజని కథానాయికగా నటించింది. రాళ్లల్లో ఇసుకల్లో, కల్యాణ వైభోగమే అనే పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. సీతారామ కల్యాణం సినిమా కూడా సంచలన విజయాన్ని సాధించింది. థియేటర్లలో ముద్దుల కృష్ణయ్య సినిమా ఆడుతుండగానే ఇది విడుదలైంది. రెండింటికీ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

అనసూయమ్మ గారి అల్లుడు
నందమూరి హరికృష్ణ ఈ సినిమాను నిర్మించారు. అనసూయమ్మగా శారద నటించారు. బాలయ్య సరసన భానుప్రియ నటించింది. ఈ సినిమా జులైలో విడుదలై కాసుల వర్షాన్ని కురిపించడమేకాదు 200 రోజులు ఆడింది.

దేశోద్ధారకుడు
ఆగస్టులో విడుదలైన ఈ సినిమా రూ.5 కోట్లు వసూలు చేసి బాలయ్య ఖాతాలో మరో హిట్ పడింది. విజయవాడలో 108 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పుతో కటౌట్ ఏర్పాటు చేశారు.

కలియుగ కృష్ణుడు
బాలయ్య 30వ సినిమాగా విడుదలైంది. ఇందులోని డైలాగులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సూపర్ హిట్ గా నిలిచింది.

అపూర్వ సహోదరులు
కె.రాఘవేంద్రరావు దర్శక, నిర్మాతగా ఈ సినిమా రూపొందింది. ఉమ్మడి ఏపీలో కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది. ఈ సినిమాలో తొలిసారిగా బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+