బాలయ్య - గోపీచంద్ మలినేని మూవీలో విలన్‌గా మంచు హీరో..!
నందమూరి బాలకృష్ణ.. డైలాగులు చెప్పాలన్నా .. ఆరు పదుల వయసులో సైతం అదరగొట్టే స్టెప్పులు వేయాలన్నా అది ఆయనకే సాటి. ప్రపంచ వ్యాప్తంగా బాలయ్యకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. స్వర్గీయ ఎన్టీఆర్ తనయుడిగా చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన శైలిలో రాణించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. గత ఏడాది సంక్రాంతికి 'డాకు మహరాజ్'తో హిట్ అందుకున్న ఆయన.. రీసెంట్ గానే బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన "అఖండ 2" చిత్రంతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. కాగా పలు కారణాలతో వాయిదాలు పడుతూ వచ్చిన ఈ మూవీ.. మొత్తానికి అభిమానులను, సినీ ప్రేమికులను మెప్పించింది.
ప్రస్తుతం బాలకృష్ణ - మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కుతుంది. NBK111 అనే వర్కింగ్ టైటిల్ తో మూవీ నిర్మించానున్నారు. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ కూడా చేశారు. దీన్ని గమనిస్తే బాలకృష్ణ మరోసారి ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారని.. పిరియాడికల్ మైథాలజీ కాన్సెప్ట్ తో సినిమా రాబోతుందని భావిస్తున్నారు. అంతే కాకుండా బాలయ్య సినిమాకి మరోసారి తమన్ సంగీతం అందించబోతున్నారు. వృధ్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తుండగా.. లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యింది.

రేపటి నుంచే షూటింగ్ షురూ..
కాగా రెగ్యులర్ షూటింగ్ పనులు హైదరాబాద్‌లో రేపటి ( మార్చి 5, 2026 ) ఘనంగా ప్రారంభం కానున్నట్టు సమాచారం. ఈ సినిమాను రాబోయే దసరా కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ మూవీలో ఒక కీ రోల్ కోసం నటుడు మంచు మనోజ్ ను ఎంపిక చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం మనోజ్ హీరో గానే కాకుండా ముఖ్యపాత్రలు కూడా చేస్తుండడంతో బాలయ్య సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టే అని భావిస్తున్నారు.
అంతే కాకుండా గతంలో బాలయ్యతో కలిసి 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా' సినిమాలో మనోజ్ నటించారు. అప్పుడు మనోజ్ కోసం బాలయ్య ముఖ్య పాత్రకు ఓకే చెబితే.. ఇప్పుడు బాలకృష్ణ కోసం మనోజ్ ఓకే చెప్పారని అంటున్నారు. మంచు - నందమూరి కుటుంబాల మధ్య ఉన్న సన్నిహిత్యానికి ఇది మరో నిదర్శనం అంటూ చెప్పుకొస్తున్నారు. మరి మంచు మనోజ్ కీలకపాత్రలో కనిపిస్తారా ? లేదా విలన్ గా చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. దీంతో మొత్తానికి పదేళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరిని కలిపి స్క్రీన్ మీద చూడబోతుండడం పట్ల ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.
-
దయచేసి నన్ను సినిమాల్లో పెట్టుకోండి: రాజశేఖర్ రిక్వెస్ట్ -
"మొన్న చెప్పి హిట్టు కొట్టా.. మళ్లీ చెప్తున్నా బంపర్ బ్లాక్ బస్టర్" -
'బైకర్' ట్రైలర్ రిలీజ్.. శర్వానంద్ ఈసారి హిట్ కొట్టేశాడోచ్..! -
'అమ్మా.. నాకు ఈ యాక్టింగ్ వద్దు!': కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరోయిన్!! -
తెలంగాణ గద్దర్ అవార్డుల్లో చిన్న సినిమా హవా! -
ఉస్తాద్ భగత్ సింగ్ కాస్ట్లీ మిస్టేక్.. !! -
బన్నీ మూవీలో ఐదుగురు భామలా? అట్లీ స్కెచ్ మామూలుగా లేదుగా! -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications