ఆ సినిమా అట్టర్ ఫ్లాప్: బాలయ్య సంచలన వ్యాఖ్యలు

నందమూరి నటసింహం బాలకృష్ణకు, అల్లు కుటుంబానికి మధ్య ఎంతో స్నేహ సంబంధం ఉంది. ఇది రోజురోజుకూ పెరుగుతోంది. అల్లు అరవింద్ ఆహా ఓటీటీలో బాలయ్య అన్ స్టాపబుల్ షో చేస్తున్నారు. దీనివల్ల బాలయ్య క్రేజ్ విపరీతంగా పెరిగింది. త్వరలోనే బాలయ్యతో సినిమా చేసేందుకు అల్లు అరవింద్ సిద్ధమవుతున్నారు. అఖండ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ రెండు కుటుంబాలకు చెందిన సభ్యులు తరుచుగా కలుసుకుంటూ కష్టసుఖాలు మాట్లాడుకుంటున్నారు.

సెంటిమెంట్ గా మారిందన్న బాలకృష్ణ
ఇటీవల ఓ సినిమా ఈవెంట్ లో బాలకృష్ణ, అల్లు శిరీష్ మధ్య సరదా సంభాషణ జరిగింది. శిరీష్ మైక్ పట్టుకొని బాలకృష్ణ వద్దకు వచ్చి సార్.. మీ సినిమాలన్నీ ఎక్కువగా సింహా పేరుతో ఉంటాయికదా.. అది మీ సెంటిమెంటు.. ఆ పేరుతో వచ్చిన సినిమాలన్నీ హిట్ అయ్యాయికదా అన్నారు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీనరసింహ, సింహా, జైసింహా, వీరసింహారెడ్డిలాంటివన్నీ చేశారు అన్నారు. దానికి బాలయ్య అవును అని సమాధానం ఇచ్చారు. సింహ అంటే సెంటిమెంట్ గా మారింది అన్నారు.

nandamuri balakrishna explains why his movie Simham Navvindi flopped

సినిమా ఆడలేదుగా.. పోయింది
ఇవన్నీ కాకుండా మీరు నటించిన మరో సినిమా ఉంది చెప్పండి అన్నారు. దానికి బొబ్బిలి సింహం అని బాలయ్య సమాధానం ఇచ్చారు. అది కూడా కాదు.. మరో సినిమా ఉంది.. చెప్పాలన్నారు. ఆ సినిమా ఏదో గుర్తుకురాక బాలయ్య ఇరకాటంలో పడ్డారు. ఆ ప్రశ్నకు అల్లు శిరీష్ సమాధానం ఇస్తూ సింహం నవ్వింది సినిమా సార్ అని చెప్పారు. వెంటనే బాలయ్య ఆ సినిమా పోయిందని, ఫ్లాపైందన్నారు. దీంతో అక్కడున్నవారంతా నవ్వగా బాలయ్య.. సింహం నవ్వడమేంటి.. టైటిలే తప్పు పెట్టారు.. అందుకే ఆ సినిమా పోయిందన్నారు. సింహం నవ్వింది సినిమాలో ఎన్టీఆర్ తోపాటు బాలకృష్ణ కూడా నటించారు. తన సినిమా టైటిల్స్ లో సింహ అనే పేరు ఉంటే కచ్చితంగా హిట్ అవుతుంది అనే సెంటిమెంట్ బాలయ్యకు పడిపోయింది. దాదాపుగా ఆయన సినిమాల పేర్లన్నీ అలాగే వస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+