బాలకృష్ణ సినిమాను బ్యాన్ చేసిన కేంద్ర ప్రభుత్వం?

నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరంలేదు. తన తండ్రి, దివంగత నందమూరి తారకరామారావు వారసుడిగా సినీ పరిశ్రమలోకి ప్రవేశించి 50 సంవత్సరాలుగా పరిశ్రమలో కొనసాగుతున్నారు. అగ్ర కథానాయకుల్లో ఒకరిగా ఉండి అభిమానులను అలరిస్తున్నారు. తన కెరీర్ లో ఎప్పుడూ లేనివిధంగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టి తన 109వ సినిమాలో కూడా హుషారుగా నటిస్తున్నారు. దీనికి కొల్లి బాబీ దర్శకుడు. ఈ ఏడాది విజయ దశమికి విడుదల కాబోతోంది.

50 ఏళ్లు పూర్తిచేసుకోబోతున్న బాలయ్య
వచ్చేనెల 29వ తేదీతో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి 50 సంవత్సరాలు పూర్తిచేసుకోబోతున్న అరుదైన వ్యక్తిగా నిలవబోతున్నారు. ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ బాలకృష్ణను ఘనంగా సత్కరించబోతోంది. బాలయ్య తొలి చిత్రం తాతమ్మ కల అనేక వివాదాలకు నిలయంగా నిలిచింది. దానికి సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం. ఏదైనా ఒక వర్గం లేదంటే ఎవరివైనా మనోభావాలు దెబ్బతినేలా సినిమాను తీస్తే కేంద్ర ప్రభుత్వం లేదంటే రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాన్ చేసిన సందర్భాలు మనదేశంలో చాలావున్నాయి.

nandamuri balakrishna first movie taathamma kala was banned by the central government

పోటాపోటీగా నటించిన ఎన్టీఆర్-భానుమతి
సీనియర్ ఎన్టీఆర్ తాతమ్మకలను స్వీయ దర్శకత్వంలో తీయడంతోపాటు ఆయనే హీరోగా, భానుమతి హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం విడుదలై అర్థ శతదినోత్సవం జరుపుకున్న తర్వాత కేంద్రం బ్యాన్ చేసింది. దీనిపై ఎన్టీఆర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తర్వాత కేంద్రం సూచనలకు అనుగుణంగా కొన్ని మార్పు చేర్పులు చేసి 1975 సంక్రాంతికి మళ్లీ విడుదల చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. మళ్లీ విడుదలైనప్పుడు అదనంగా కలర్ ఓ పాటను కలపడంతోపాటు సినిమా చివరలో ముసలవ్వ భర్త పాత్రగా ఎన్టీఆర్ వృద్ధుడి పాత్రను అద్భుతంగా పోషించారు.

భగవంతుడి నిర్ణయానికి వ్యతిరేకంగా ఉండకూడదు
ఈ సినిమా అంత వివాదాలకు కారణమవడానికి కారణం ఏమిటంటే.. భగవంతుడు మనకి సంతానాన్ని ప్రసాదిస్తున్నాడు.. దానికి వ్యతిరేకంగా మనం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోవడం అనేది విరుద్ధమని చెప్పింది. అంతేకాకుండా భూ గరిష్ట చట్టాన్ని కూడా ఈ సినిమా వ్యతిరేకించింది. ఈ రెండు అంశాల్లో ప్రధానంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల అంశాంపైనే కేంద్ర ప్రభుత్వం బ్యాన్ విధించింది. ఈ సినిమాలో ఎన్టీఆర్-భానుమతి పోటీపడి నటించారు. తర్వాత ఎన్టీఆర్-బాలయ్య నటించి శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర సినిమా కూడా నిషేధానికి గురవగా అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ దీన్ని విడుదల చేయగా సంచలన విజయాన్ని అందుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+