బ్యాడ్‌లక్: బాలయ్య వదులుకున్న భారీ బ్లాక్‌బస్టర్లు
నందమూరి బాలకృష్ణ కెరీర్ పరంగా అద్భుతమైన పురోగతిలో ఉన్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో వరుసగా హ్యాట్రిక్ కొట్టారు. ఐఫా నుంచి గెల్డెన్ లెగసీ అవార్డును తాజాగా అబుదాబిలో అందుకున్నారు. తన వారసుడు మోక్షజ్ఞ, తన మనవడు అని ప్రకటించారు. ప్రస్తుతం కొల్లి బాబీ దర్శకత్వంలో చేస్తున్న 109వ సినిమా సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు. అయితే అది వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. కెరీర్ లో బాలయ్య కాల్షీట్లు ఖాళీ లేకపోవడంతో కొన్ని సినిమాలను వదులుకోవాల్సి వచ్చింది. మరికొన్ని సినిమాలను ఇతరత్రా కారణాలతో చేయలేదు. అవన్నీ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. బాలయ్య ఏయే సినిమాలను వద్దన్నారో వాటి వివరాలను తెలుసుకుందాం.
వకీల్ సాబ్
ఈ చిత్రాన్ని మొదటి బాలయ్యతో చేద్దామనుకున్నారు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో దిల్ రాజు చెప్పారు. తర్వాత ఏమైందో కారణాలు తెలియరాలేదుకానీ చివరకు పవన్ కల్యాణ్ తో తెరకెక్కించి బ్లాక్ బస్టర్ సాధించారు.

సైరా నరసింహారెడ్డి
ఈ చిత్రాన్ని బాలయ్యతో చేయాలని పరుచూరి బ్రదర్స్ భావించారు. ఆయన బాడీలాంగ్వేజ్ కు అనుగుణంగా కథను, డైలాగులను కూడా సిద్ధం చేసుకున్నారు. కొన్నాళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పేరు వినిపించింది. చివరకు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి చేశారు.
సూర్యవంశం
భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను ముందుగా బాలయ్యతో చేయాలని నిర్మాత ఆర్ బీ చౌదరి భావించి బాలయ్యను కలిశారు. అయితే ఈ కథ ఇంతకుముందు తాను చేసిన పెద్దన్నయ్యను పోలివుండటంతో ఈ సినిమా పట్టాలెక్కలేదు. చివరకు వెంకటేష్ హీరోగా వచ్చి బ్లాక్ బస్టర్ సాధించింది.
బజారు రౌడీ
ఈ సినిమాను కూడా దర్శకుడు కోదండరామిరెడ్డి బాలకృష్ణతో చేద్దామనుకున్నారు. కలిసి కథ చెప్పారు. అయితే ఆ సమయంలో బాలయ్య చాలా బిజీగా ఉన్నారు. డేట్లు సర్దుబాటు చేయడం కుదర్లేదు. దీంతో కృష్ణ తనయుడు రమేష్ బాబుతో తెరకెక్కించారు. సినిమా మంచి సూపర్ హిట్ అయింది.
అన్నవరం
భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు ముందుగా బాలకృష్ణను అనుకున్నారు. అయితే అంతకుముందే తాను చెల్లెలి సెంటిమెంట్ తో సినిమాలు చేసివుండటంతో ఈ సినిమా చేయడానికి తిరస్కరించారు. దీంతో పవన్ కల్యాణ్ హీరోగా ఈ సినిమా తెరకెక్కిందికానీ అంచనాలను అందుకోలేకపోయింది.












Click it and Unblock the Notifications