రజనీకాంత్ తో బాలకృష్ణ వదులుకున్న సినిమా
రజనీకాంత్ ఇటీవలే జైలర్ చిత్రంలో సంచలన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా సుమారు రూ.750 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రజినీ స్టామినాను మరోసారి చాటింది. ఈ చిత్రంలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ క్యామియో రోల్స్ పోషించారు. వీరు పోషించిన ఈ పాత్రలు అతిథి పాత్రలే అయినప్పటికీ సినిమాపై బాగా ప్రభావం చూపాయి. ఆయా భాషల్లో కూడా జైలర్ సినిమాకు ఎక్కువ కలెక్షన్లు రావడానికి కారణమయ్యాయి.
వీరిద్దరిలానే తెలుగులో నందమూరి నటసింహం బాలకృష్ణను కూడా క్యామియో రోల్ చేయించాలని దర్శకుడు భావించారు. కథ గురించి చెప్పినప్పటికీ బాలకృష్ణ తిరస్కరించారు. ఆయన కూడా ఈ సినిమాలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లా క్యామియో రోల్ చేయించివుంటే సినిమా కలెక్షన్లు రూ.800 కోట్లు దాటేవని, తెలుగులో మరిన్ని వసూళ్లు వచ్చేవని సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. బాలయ్య ఒప్పుకోకపోయినప్పటికీ వారిద్దరితోనే ఈ పాత్రలు చేయించి దర్శకుడు భారీ విజయాన్ని రాబట్టాడు. జైలర్ లో బాలకృష్ణ కూడా అతిథి పాత్రలో తళుక్కున మెరిస్తే తమిళంతోపాటు, తెలుగు, కన్నడం, మళయాళ పరిశ్రమల నుంచి అందరు స్టార్ హీరోలు తెర పంచుకునే అవకాశం ఉండేదని, అయితే దాన్ని మిస్సయ్యామని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జైలర్ సినిమాతో 70 సంవత్సరాల వయసులో కూడా తాను బ్లాక్ బస్టర్ విజయాలు అందించగలనని రజనీకాంత్ నిరూపించుకున్నారు. స్టైల్ గా కాయిన్ పైకి విసిరేయడం, సిగరెట్ వెలిగించడం.. ఇలా ఏంచేసినా దానికో స్టైల్ రజనీవల్లే వచ్చేది. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రజనీ సిద్ధమవుతున్నారు. కమల్ కు భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చిన లోకేష్ రజనీకి కూడా సూపర్ హిట్ ఇవ్వబోతున్నారని అభిమానులు అంటున్నారు.












Click it and Unblock the Notifications