బాలయ్య వదులుకున్న బ్లాక్ బస్టర్ మూవీస్
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో వీరమాస్ అనే సినిమా చేస్తున్నారు. తన 109వ సినిమాగా ఇది రూపుదిద్దుకుంటోంది. దీనికి ముందు అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరితో వరుస హ్యాట్రిక్ సినిమాలు ఇచ్చాడు. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రస్తుతానికి బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు విరామం ప్రకటించి ఎన్నికల ప్రచారంలోకి దిగుతున్నారు. అనంతపురం జిల్లాలోని హిందూపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. వరుసగా రెండుసార్లు గెలుపొందిన బాలయ్య హ్యాట్రిక్ కొడతానని ప్రకటించారు.
నందమూరి హరికృష్ణ అడపా దడపా సినిమాలు చేస్తుండటంతో తన వారసుడిగా ఎన్టీరామారావు బాలయ్యను తీర్చిదిద్దారు. అందుకు తగ్గట్లుగానే స్టార్ హీరోగా మారారు. దర్శకుడు వైవీఎస్ చౌదరి హరికృష్ణతో లాహిరి లాహిరి లాహిరిలోతోపాటు సీతయ్య సినిమాలు చేశాడు. ఈ రెండు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. వాస్తవానికి దర్శకుడు చౌదరి ఈ కథలను ముందుగా బాలయ్యకు వినిపించాడు. అయితే డేట్లు ఖాళీ లేకపోవడంతోపాటు మరికొన్ని కారణాలతో వాటిని బాలకృష్ణ తిరస్కరించారు.

తర్వాత కథను సిద్ధం చేసుకోమని, ఇద్దరం కలిసి సినిమా చేద్దామని బాలయ్య దర్శకుడికి చెప్పారు. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో ఒక్కమగాడు సినిమా వచ్చింది. అది భారీ డిజాస్టర్ గా నిలిచింది. దీనిపై నందమూరి అభిమానులు దర్శకుడిని భారీగా ట్రోలింగ్ చేశారు. భారతీయుడు సినిమా నువ్వు మళ్లీ తీసేదేందంటూ మండిపడ్డారు. లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య సినిమాలు ముందే బాలయ్య చేసుంటే కెరీర్ లో రెండు సూపర్ హిట్ సినిమాలు ఉండేవని, ఒక్కమగాడు సినిమాతో కెరీర్ పై భారీ మచ్చ పడిందంటూ విమర్శించారు. ఒక్క మగాడు సినిమా బాలయ్య కెరీర్ కు ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందంటూ నందమూరి అభిమానులు నిరాశపడ్డారు.












Click it and Unblock the Notifications