సంచలన రికార్డ్ సొంతం చేసుకున్న బాలయ్య

నందమూరి నటసింహం బాలకృష్ణకి రికార్డులు కొత్త కాదు. తెలుగునాట ఎన్నో సంచలన రికార్డులు సృష్టించారు. తాజాగా ఆయన యూఎస్ మార్కెట్ లోనూ సత్తా చాటుతున్నారు. అక్కడ హ్యాట్రిక్ వన్ మిలియన్ డాలర్ మూవీస్ ఉన్న తొలి తెలుగు సీనియర్ హీరోగా అరుదైన రికార్డ్ సాధించారు. గత రెండు చిత్రాలు 'అఖండ', 'వీరసింహారెడ్డి'తో యూఎస్ లో 1 మిలియన్ మార్క్ అందుకున్న బాలయ్య.. ఇప్పుడు 'భగవంత్ కేసరి'తో మరోసారి ఆ ఫీట్ సాధించారు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న భగవంత్ కేసరి ఈనెల 19వ తేదీన విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని విడుదలైంది. మొదటిరోజు మొదటి ఆట నుంచే సినిమాకు పాజిటివ్ టాక్ రావడం.. పోటీగా విడుదలైన రెండు సినిమాలు లియో, టైగర్ నాగేశ్వరరావు నిరాశపరచడం బాగా కలిసివచ్చింది.
సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది. అమెరికాలో దీనికి బ్రహ్మరథం పడుతున్నారు. నాలుగు రోజుల్లోనే వన్ మిలియన్ డాలర్ కు పైగా వసూలు చేసి, బ్రేక్ ఈవెన్ సాధించింది. ప్రస్తుతం 1.5 మిలియన్ దిశగా దూసుకుపోతోంది.

nandamuri balakrishna new record for bhagavanth kesari

యూఎస్ లో హ్యాట్రిక్ వన్ మిలియన్ డాలర్ మూవీస్ ఉన్న తొలి తెలుగు సీనియర్ హీరోగా బాలకృష్ణ నిలిచారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లో ఎవరూ ఇప్పటిదాకా ఈ ఫీట్ సాధించలేదు. సినిమాలో బాలయ్య నటన, శ్రీలీల నటన అందరినీ ఆకట్టుకుంది. ఆడపిల్లలకు ధైర్యంగా పెంచడం గురించి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించడంతోపాటు బ్యాడ్ టచ్, గుడ్ టచ్ గురించి చెప్పిన విధానానికి ప్రేక్షకులు, అభిమానులు ఫిదాఅయిపోయారు. అమెరికాలో మిలియన్ డాలర్లు అందుకోవడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల వసూళ్లవైపు దూసుకుపోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+