Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బాలయ్యతో దిల్ రాజు సినిమా ఫిక్స్.. డైరెక్టర్ అతడే

నందమూరి నటసింహం బాలకృష్ణతో సినిమా తీయాలని ఎన్నో సంవత్సరాల నుంచి నిర్మాత దిల్ రాజు ఎదురుచూస్తున్నారు. బాలయ్యకు సంబంధించిన ఎన్నో సినిమాలను నైజాంలో, వైజాగ్ ప్రాంతంలో పంపిణీ చేశారు. బాలయ్య 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసింది కూడా దిల్ రాజే. అయితే ఆ సమయంలో సినిమా బాగా ఆడుతున్నప్పటికీ, మంచి కలెక్షన్లు వస్తున్నప్పటికీ హఠాత్తుగా థియేటర్ల నుంచి దిల్ రాజు తీసేశారని, అప్పటి నుంచి దిల్ రాజు అంటే బాలకృష్ణ కోపంగా ఉన్నారంటూ వార్తలు వచ్చాయి.

కొంతకాలం నుంచి సూపర్ ఫాంలో ఉన్న బాలయ్యతో సినిమా తీస్తే నందమూరి తారకరామారావు వారసుడు బాలయ్య సినిమా తీశాను అనే సంతృప్తి ఉంటుందని దిల్ రాజు ప్రకటించుకుంటూ వస్తున్నారు. ఎట్టకేలకు దిల్ రాజు బ్యానరులో సినిమా చేసేందుకు నందమూరి బాలకృష్ణ కూడా ఒప్పుకున్నారు.

Nandamuri Balakrishna Next Movie Under Dil Raju Production House Vasishtha To Direct This Film

ఓకే అన్న బాలయ్య

ఇటీవలి కాలంలో మళయాళ డైరెక్టర్ పేరు బాగా వినిపించింది. మార్కో సినిమా తీసిన హనీఫ్ అడేని మంచి శక్తివంతమైన కథను తయారుచేసి బాలయ్యకు వినిపించగా ఓకే అయింది. అయితే ఏమైందో తెలియదుకానీ అనుకోకుండా ఈ ప్రాజెక్టులోకి హఠాత్తుగా బింబిసార, విశ్వంభర డైరెక్టర్ వశిష్ట వచ్చి చేశారు. చిరంజీవి హీరోగా చేస్తున్న విశ్వంభర త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. వశిష్ట చెప్పిన కథ బాలయ్యకు నచ్చింది. అయితే అది ఏ తరహా కథ అనేది ఇంకా బయటకు రాలేదు. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలనే యోచనలో దిల్ రాజు ఉన్నారు. బాలయ్య కూడా అందుకు ఓకే చెప్పారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటించబోతున్న సినిమా షూటింగ్ తాజాగా ప్రారంభమైంది.

సంక్రాంతికి విడుదల చేయాలని

ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తిచేసి విజయదశమికి విడుదల చేయనున్నారు. అలాగే సంక్రాంతికి కూడా ఒక సినిమా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్న బాలయ్య దిల్ రాజు సినిమాను కూడా సమాంతరంగా పట్టాలెక్కించి సంక్రాంతికి తీసుకురాబోతున్నారు. అంటే రెండున్నర నెలల సమయంలోనే బాలయ్య మరో సినిమాను అభిమానుల ముందుకు తీసుకురాబోతున్నారు. వచ్చే సంక్రాంతికి వెంకటేష్-అనిల్ రావిపూడి, చిరంజీవి-బాబీ, నాగార్జున-కల్యాణ్ కృష్ణ సినిమాలు రాబోతున్నాయి. దీనికి అదనంగా బాలయ్య సినిమా కూడా చేరితే 2027 సంక్రాంతికి థియేటర్ల దగ్గర అదిరిపోయే వేడి వాతావరణం ఉంటుందని, అగ్ర కథానాయకుల అభిమానులంతా అక్కడే ఉంటారని, ఎవరి సినిమాలను సినీ ప్రియులు ఆదరిస్తారో చూడాలని సినీ విశ్లేషకులు అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+